సాధారణంగా భారత క్రికెట్ లో ఎంతో మంది ఆటగాళ్లు పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు జట్టులో స్థానం కోల్పోతూ ఉంటారు. ఇక ఇలాంటి ఆటగాళ్లు మళ్లీ తాము ఫుల్ ఫామ్ లోకి వచ్చామని.. తమ ఆట తీరులో కూడా మరింత రాటుదేలాము అని నిరూపించుకోవడానికి ఐపీఎల్ ఒక మంచి వేదికగా మారిపోయింది. ఇలా భారత అంతర్జాతీయ జట్టుకు దూరమైన ఎంతో మంది ఆటగాళ్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో తన సత్తా చాటిమళ్లీ జట్టులోకి పునరాగమనం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఒక బౌలర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.


 ఆ బౌలర్ ఎవరో కాదు ఉమేష్ యాదవ్.. గతంలో కూడా ఇతని పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయింది.. అతనికి సరిగ్గా బౌలింగ్ వేయడం రాదని.. ఇక ఎప్పుడు బౌలింగ్ వేసిన భారీగా పరుగులు సమర్పించుకుంటాడని.. ఇక బిసిసిఐ అతనికి జట్టు నుంచి తప్పించి మంచి పని చేసింది.. తనకి అవకాశాలు ఇవ్వడం కూడా వృథా అనే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా చర్చించుకునేవారు.  కానీ ఇలా ఒకప్పుడు ఉమేష్ యాదవ్ బౌలింగ్ చూసి చిరాకు పడ్డ వారు ఇక ఇప్పుడు అతనీ బౌలింగ్ చూసి అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  భారీ పరుగులు ఇస్తాడు అని విమర్శలు ఎదుర్కొన్న ఉమేష్ యాదవ్ కాస్త ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతున్నాడు. తన బౌలింగ్లో ఏదో మ్యాజిక్ ఉంది అని అనిపిస్తూ ఉన్నాడు.. ఎందుకంటే సరికొత్త బౌలింగ్ టెక్నిక్ తో మళ్లీ తెర మీదికి వచ్చాడు ఉమేష్ యాదవ్.   కోల్కతా నైట్రైడర్స్ జట్టు మూడు మ్యాచ్లు ఆడగా.. ఇక ఈ మూడు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసి ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు ఉమేష్ యాదవ్. ఇక 4.9 1 ఎకనామిక్ కూడా ఉండడం విశేషం. ముఖ్యంగా పవర్ ప్లే లో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను దెబ్బ కొడుతూనే ఉన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో తొలి రెండు రౌండ్లలోఉమేష్ యాదవ్ ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. కానీ మూడవ రౌండులో కోల్కతా జట్టు దక్కించుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl