ఐపీఎల్ సీజన్ 15 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులకు ఎంతో ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తోంది. గత రాత్రి పంజాబ్ మరియు గుజరాత్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం ఆఖరి బంతి వరకూ ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ఆఖరి బంతి ఫలితం తేలిన చాలా మ్యాచ్ లలో ఇది కూడా ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ కు దిగిన. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగుల ఛాలెంజింగ్ స్కోర్ సాధించి గుజరాత్ కు సవాలు విసిరింది. ఈ ఇన్నింగ్స్ లో వరుసగా ఇంగ్లాండ్ స్టార్ట్ బ్యాట్స్మన్ లివింగ్ స్టన్ మరోసారి అర్థ సెంచరీ సాధించి జట్టు ఆ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 27 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

ఇక ఇతనికి శిఖర్ ధావన్ (35)  జితేస్ శర్మ  (23), షారుఖ్ ఖాన్ (15) ల నుండి మంచి సహకారం లభించింది. భారీ లక్ష చేధనతో బరిలోకి దిగిన గుజరాత్ మొదటి నుండి దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ శుబ్మన్ గిల్ 96 పరుగులు చేయి జట్టు విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఇతనికి సుదర్శన్ మరియు హార్దిక పాండ్య చక్కగా సహకరించారు. అయితే మ్యాచ్ లో ఆఖరి నాలుగు ఓవర్ లకు 50 పరుగులు చేస్తే గుజరాత్ గెలుస్తుంది. ఈ దశలో అర్ష్ దీప్ సింగ్ మరియు రబడాలు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఖరి ఓవర్ కు 19 పరుగులకు తీసుకు వచ్చారు. ఆఖరి ఓవర్ ను ఒడియన్ స్మిత్ కు ఇచ్చాడు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్.

క్రీజులో మిల్లర్ మరియు పాండ్య లు ఉన్నారు. మొదటి బంతి వైడ్ వేశాడు. దీనితో 6 బంతులకు 18 పరుగులుగా సమీకరణం మారింది. తర్వాత బంతికే లేని పరుగుకు ప్రయత్నించి పాండ్య రన్ ఔట్ గా వెనుదిరిగాడు. దీనితో మ్యాచ్ అయిపోయింది అని ఇక పంజాబ్ తో విజయం అని అనుకున్నారు. మొదటి మ్యాచ్ హీరో రాహుల్ తెవాతియా క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. స్ట్రైకింగ్ కు వెళ్లిన మిల్లర్ 3 వ బంతిని 4 గా మలిచాడు, అప్పుడు సమీకరణం 3 బంతుల్లో 13 గా అయింది. అప్పుడు అందరిలోనూ నరాలు తెగే టెన్షన్. అప్పుడే పంజాబ్ ఆటగాడు ఒడియన్ స్మిత్ ఒక పెద్ద తప్పు చేశాడు. నాలుగవ బంతిని మిల్లర్ కు సంధించాడు. కానీ ఆ బంతిని షాట్ ఆడని మిల్లర్ స్ట్రెయిట్ గా డిపెండ్ చేశాడు.

అయితే ఆ బంతిని ఆపిన స్మిత్ తొందరలో తెవాతియా రన్ ఔట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ వికెట్లు తగలని బంతి నేరుగా లాంగ్ ఆన్ లో ఉన్న ఫీల్డర్ వైపు వెళ్ళింది. దీనితో ఒక ఎక్స్ట్రా పరుగు లభించింది. దీంతో తెవాతియా కు స్ట్రైకింగ్ వచ్చింది. ఆఖరి రెండు బంతులకు 12 చేస్తే విజయం గుజరాత్ ది అవుతుంది. కానీ గత సంవత్సరం షార్జా లో చేసిన విధంగానే రెండు బంతులను సిక్స్ లుగా మలిచి గుజరాత్ టైటాన్స్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాడు. అయితే నాలుగవ బంతికి కనుక రన్ ఔట్ చేయడానికి ట్రై చేయకపోయి ఉంటే ఒక పరుగు మిగిలి ఉండేది. అప్పుడు ఆఖరి రెండు బంతికి సిక్స్ లు అయినా మ్యాచ్ డ్రా గా ముగిసేది. సూపర్ ఓవర్ లో ఫలితం తేలి ఉండేది.

అలా కాకున్నా మిల్లర్ రెండు బంతుల్లో సిక్స్ లు కొట్టేవాడు కాదు. అయితే స్మిత్ చేసిన ఈ చిన్న తప్పు కారణంగా పంజాబ్ మ్యాచ్ ను ఓడిపోవాల్సి వచ్చింది. అందుకే ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో ఎంతో సంయమనంగా మరియు షార్ప్ గా ఉండాలి. ఏ చిన్న తప్పు చేసినా అది ప్రత్యర్థికి ప్లస్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: