ఐపీఎల్ హిస్టరీలో దిగ్గజ జట్టు చెన్నై సూపర్ కింగ్ కి నాలుగవ ఓటమి తప్పలేదు. ఎంతో బలహీనంగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఐపిఎల్ మ్యాచ్ అనేసరికి ఇక చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో కూడా ఓటమి చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.


 సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్మెన్ ను పూర్తిగా విఫలమయ్యారు. తొలి రెండు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన చేసిన రాబిన్ ఉతప్ప తరువాత రెండు మ్యాచ్ల్లో చేతులెత్తేశాడు. ఓపెనర్ రుతురాజ్  పేలవమైన ఫామ్ తో ఇబ్బందులు పడుతున్నాడు. ఓపెనర్లు రాణించకపోవడంవల్ల జట్టుకు మంచి స్కోర్ లభించలేదు.


 27 బంతుల్లో 27 పరుగులు చేసిన రాయుడు బాగా రాణిస్తున్నాడు అని అనిపిస్తున్న సమయంలో వికెట్ కోల్పోయాడు రవీంద్ర జడేజా. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ధోని తొలి రెండు మ్యాచ్ లలో ఎంతో వేగంగా పరుగులు చేసి ఇక ఇటీవల మాత్రం అదే జోరు కొనసాగించలేకపోయాడు.


 మూడో ఓవర్ తొలి బంతికే సన్రైజర్స్ లో బ్యాట్స్మెన్ గా చెలరేగిపోతున్న అభిషేక్ శర్మకు చెన్నై లైఫ్ ఇచ్చింది. ముఖేష్ చౌదరి వేసిన బంతి శివం దూబే క్యాచ్ పట్టలేకపోయాడు. 14 ఓవర్లు చివరి బంతికి అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ రవీంద్ర జడేజా అందుకోలేకపోయాడు. తద్వారా 50 బంతుల్లో 77 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ.


 ముగ్గురు చెన్నై బౌలర్లు కూడా ఎక్కువ ఎక్కువ ఎకానమి తో పరుగులు ఇవ్వడం గమనార్హం. బ్రావో 10.90 జోర్దాన్ 11.30 ఎకానమీ  పరుగులతో భారీ స్కోరు సమర్పించుకున్నారు.


 ఒకవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ బౌలర్లను బాగా ఉపయోగించుకుంటే రవీంద్ర జడేజా మాత్రం తమ బౌలింగ్ విభాగాన్ని సమర్థవంతంగా వినియోగించుకోలేక పోయాడు.


 ఇరు జట్లు చూసుకుంటే... ఒకవైపు బ్యాటింగ్ విభాగంలో మరోవైపు బౌలింగ్ విభాగంలో ప్రతికూలత ఎదుర్కొంటుంది చెన్నై సూపర్ కింగ్స్. సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం బౌలింగ్లో బ్యాటింగ్లో సమిష్టిగా రాణిస్తుండడం జట్టు విజయానికి కారణమైంది చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl