సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటే ధన ధన పటా ఫట్  అనే ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్.  బ్యాట్స్మెన్లు క్రీజులోకి వచ్చిన బౌలర్లపై శివ తాండవం చేస్తే ఎలా ఉంటుందో బెంగళూరు చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ప్రేక్షకులు అందరూ చూశారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు శివం దుబే రాబిన్ ఉతప్ప బెంగళూరు  బౌలర్లపై కనికరం చూపించకుండా విరుచుకుపడ్డారు. సింగిల్ తీయడం కాదు ఫోర్లు సిక్సర్లతో స్టేడియం మొత్తం దద్దరిల్లి పోయేలా చేశారు. ఇక బౌలర్ ఎవరైనా బంతి ఎక్కడ వేసినదానికి బౌండరీ తరలించడమే లక్ష్యంగా చిత్తక్కొట్టుడు కొట్టారు.


 ఏకంగా 95 పరుగులతో శివమ్ దూబే రానిస్తే 84 పరుగులతో రాబిన్ ఉతప్ప తిరుగులేదు అని నిరూపించాడు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో శివమ్ దూబే కేవలం 45 బంతుల్లో 95 పరుగులు చేసి అదరగొట్టాడు. జట్టు విజయంలో కీలక పాత్ర వహించడమే కాదు ఒక అరుదైన రికార్డును కూడా సాధించాడు శివం దూబే. శివం దూబే ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కానీ త్రుటిలో సెంచరీ అవకాశం మిస్ అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శివం దూబే 95 పరుగులతో పదకొండేళ్ల రికార్డును సమం చేశాడు.


ఇంతకీ ఆ రికార్డు ఏమిటి అంటే.. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముఖాముఖి తలపడిన సందర్భాల్లో ఇక అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొనసాగుతున్న బ్యాట్స్ మెన్ల అత్యధిక వ్యక్తిగత స్కోరు 95. 11 ఏళ్ల నుంచి ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. 2011 ఐపీఎల్ సీజన్ సమయంలో చెన్నైబెంగళూరు జట్ల మధ్య ఫైనల్లో చెన్నై జట్టు లో ఆడుతున్న మురళీ విజయ్ 95 పరుగులు సాధించిన జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఇప్పుడు పదకొండేళ్ల తర్వాత శివం దూబే 95 పరుగులు చేసి ఈ రికార్డును సమం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl