
ఇక రవీంద్ర జడేజాకు కెప్టెన్గా మొదటి విజయం కావడంతో జడ్డు అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఇక మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడిన రవీంద్ర జడేజా తన కెప్టెన్సీ లో మొదటి విజయం దక్కడంపై హర్షం వ్యక్తం చేశాడు. మొదటి గెలుపులు జట్టు సభ్యులతో పాటు తన భార్య రివా సోలంకికి కూడా అంకితం ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రవీంద్ర జడేజా. కెప్టెన్గా మొదటి విజయం ఎప్పటికీ కూడా నాకు ప్రత్యేకమే. గత నాలుగు మ్యాచ్ లలో ఓటమితో ఎంతగానో నిరాశే ఎదురైంది. కానీ ఇప్పుడు మేము పుంజుకున్నాము. బ్యాటింగ్ యూనిట్లో ప్రతి ఒక్కరూ తమ పాత్రను నెరవేర్చారు.
బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నిజానికి నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయినప్పటికీ మేనేజ్మెంట్ నాపై ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. ఇక ఇంకా నేను కెప్టెన్గా నేర్చుకునే దశలోనే ఉన్నా.. కెప్టెన్ అయినప్పటికీ సీనియర్ల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తూనే ఉంటా.. ఇక మహి భాయ్ తో ప్రతి విషయం చర్చిస్తూనే ఉన్నా.. సారధిగా ఎదగడంలో ఆ పాత్రలో ఒదిగేందుకు మహి సలహాలు ఎంతగానో పనికొస్తాయని నమ్ముతాను.. మంచి సారథిగా ఎదిగేందుకు కాస్త సమయం పట్టవచ్చు అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడూ..