సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటేనే అద్భుతమైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ ఎందుకంటే టెస్టు ఫార్మాట్లో సుదీర్ఘకాలంపాటు పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక వన్డే ఫార్మాట్లో కూడా కాస్త ఎక్కువగానే సమయం ఉంటుంది. కానీ టి20 ఫార్మాట్లో మాత్రం బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ప్రతి ఆటగాడు కూడా ఇక బౌలర్ వేసిన ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. బంతి ఎలా వచ్చినా ఎక్కడ వేసిన సిక్సర్లు ఫోర్లు కొడుతూ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.


 అందుకే టి20 ఫార్మాట్ అంటే క్రికెట్ ప్రేక్షకులందరికీ తెగిన నచ్చేస్తూ ఉంటుంది. ఐపీఎల్ లో కూడా అంతకు మించి అనే రేంజ్ లోనే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు చెన్నై బ్యాట్స్మెన్లు. రాబిన్ ఉతప్ప శివమ్ దూబే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లపై విరుచుకుపడినా తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే రాబిన్ ఉతప్ప 84 పరుగులతో రానిస్తే శివ 95 పరుగులు చేసింది కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.


 ఈ క్రమంలోనే 4 ఓటముల తర్వాత తమ జట్టుకు ఏకంగా 24 పరుగుల తేడాతో విజయాన్ని అందించడంలో ఇద్దరు కీలక పాత్ర వహించారు. అయితే బెంగళూరు పై మ్యాచ్లో ఏకంగా ఫోర్లు సిక్సర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. చెన్నై ఇన్నింగ్స్ లో మొత్తం 12 ఫోర్లు నమోదు కాగా.. ఇక చెన్నై బ్యాట్స్మెన్లు  ధాటిగా ఆడటంతో 17 సిక్సర్లు  నమోదయ్యాయి. ఇందులో రాబిన్ ఉతప్ప 9 సిక్సర్లు కొట్టగా.. శివం దూబే ఎనిమిది సిక్సర్లతో అదరగొట్టాడు. ఇద్దరి క్రికెటర్లు ఫుల్ ఫామ్ లోకి రావడం చూసి అటు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl