ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ మెగా టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యర్థులుగా ఉన్నవారు సహచరులుగా మారిపోతారు.  అంతేకాదండోయ్ సహచరులు కాస్త ప్రత్యర్థులుగా మారిపోయి పోరాడుతూ ఉంటారు. ఇది ప్రేక్షకులకు తెగ నచ్చేస్తూ ఉంటుంది. అంతే కాదండోయ్ ఐపీఎల్ లో బ్యాటింగ్  మెరుపులు ఫీల్డర్ల విన్యాసాలు బౌలర్ల రికార్డులు ఇక క్రికెట్ లవర్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ లో ఒక అద్భుతమైన క్యాచ్ తెర మీదికి వస్తుంది. మొన్నటికి మొన్న అంబటి రాయుడు అద్భుతమైన క్యాచ్ తో వార్తల్లో నిలిచాడు. నిన్నటికి నిన్న ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు టీం వర్క్ అంటే ఏంటో చేసి చూపించారు కోల్కతా ఆటగాళ్లు.


 పాట్ కమ్మిన్స్ శివమ్ మావి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ అందుకని అందర్నీ ఫిదా చేశారు. 18 ఓవర్లు రాజస్థాన్ బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలోనే సిక్సర్ ఖాయం   అనుకుంటున్న సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చినా పాట్ కమిన్స్ బౌండరీ లైన్ కు కొన్ని ఇంచుల ముందు అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అంతలోనే బాలెన్స్ తప్పిన అతను బౌండరీ లైన్ లో తాకేలా కనిపించాడు.


 ఇక్కడ కేవలం క్షణ కాలంలోనే ఇక బౌండరీ లైన్ కి తాకబోతున్న సమయంలో తన చేతిలో ఉన్న బంతిని గాల్లోకి విసిరాడూ. దీంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన శివం మావి గాల్లోకి ఎగిరి మరి క్యాచ్ ఒడిసి పట్టాడు. దీంతో రియాన్ పరాగ్ పెవిలియన్ బాట పడ్డాడు అని చెప్పాలి. అయితే బౌండరీ లైన్ దగ్గర ఇలా టీం వర్క్ తో అద్భుతమైన క్యాచ్ లను అందుకోవడం  ఇప్పటివరకు ఎన్నో సార్లు చూశాము. ఇలాంటి క్యాచ్ లు ప్రేక్షకులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. ఆటగాళ్ళ మధ్య కచ్చితమైన సమన్వయం ఉన్నప్పుడే ఇలాంటి క్యాచ్ పట్టడం సాధ్యం అవుతుంది అని చెప్పాలి  కాగా హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: