ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఒక మంచి ఫ్లాట్ ఫామ్ గా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే  అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయాలనుకున్న ఎంతో మంది ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటి ఆ తర్వాత భారత జట్టుకు సెలెక్ట్ అవడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్ లో కూడా ఇలా సరికొత్త ప్రతిభ వెలుగులోకి వస్తూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ సారి కూడా ఎప్పటిలాగానే యువ  ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. అయితే ఇక టోర్ని అసాంతం తన అద్భుత ఆటతీరును కనబరుస్తూన్న యువ క్రికెటర్లకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తుంటారు.


 ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ,అక్షర్ పటేల్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, గిల్ లాంటి ఆటగాళ్లు ఈ అవార్డు దక్కించుకున్నారు  దేవదత్ పడిక్కాల్ రుతురాజ్ సైతం  ఈ అవార్డు దక్కించుకున్నారు. 2022 ఐపీఎల్ సీజన్ లో ఆయుష్ బాదోని,  తిలక్ వర్మ,  సాయి సుదర్శన్ అనూజ్ రావత్ తదితర ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే టీం ఇండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా ఈ ఏడాది ఎమర్జెన్సీ ప్లేయర్ ఎవరు అనే విషయం పై వ్యాఖ్యలు చేశారు   ఇదే విషయంపై క్రిక్ ట్రాకర్ అనే షోలో అతను మాట్లాడాడు. ఈ  ఏడాది ఐపీఎల్ మొదలుపెట్టి ఆటగాళ్ళనే పరిగణలోకి తీసుకున్నాడు. తిలక్ వర్మ బాగా ఆడుతున్నారు. హర్ష దీప్ సింగ్ సైతం ఆడుతున్నాడు.  అతను ఎప్పటినుంచో అడుగుతున్నాడు కాబట్టి పక్కన పెడుతున్న. ఇక నా అభిప్రాయం ప్రకారం అయితే ఐపీఎల్లో ఈసారి ఎమర్జెన్సీ ప్లేయర్ గా నిలుస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు దీప్ దాస్ గుప్తా. కాగా ప్రస్తుతం ఆయుష్ బాదోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 8 మ్యాచ్ లలో కలిపి ఏకంగా 134 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 54 కావడం గమనార్హం. అంతేకాదు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl