గత కొంత కాలం నుంచి భారత క్రికెట్లో యువ ఆటగాళ్లు ఎంట్రీతో పోటీ ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎవరైనా అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలి అంటే అందరి కంటే అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఉంది. అయితే సాధారణంగా ఇప్పటివరకూ ఎంతోమంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించి ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు. చివరకు టీమిండియాలో స్థానం కోల్పోయిన వారు ఇక ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో చోటు దక్కించుకోవాలని పోరాడుతున్నారు  అలాంటి ఆటగాళ్లు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం


 యుజ్వేంద్ర చాహల్ : గత కొంత కాలం నుంచి అడపాదడపా అవకాశాలు అందుకుంటున్నాడు చాహల్.జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎన్నో అవస్థలు పడ్డాడూ. ఇటీవల ఐపీఎల్ సీజన్ లో మాత్రమే అదరగొడుతున్నాడు. 7.09 ఎకనామిక్ తో 18 వికెట్లు పడగొట్టి ప్రస్తుతం ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు.


 కుల్దీప్ యాదవ్ : ఇక ఈ మణికట్టు స్పిన్నర్ కి అసలు కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. గత రెండేళ్లలో ఇతనికి టీమిండియాలో దక్కింది అతి తక్కువ ఛాన్సులే. ఈ ఏడాది ఐపీఎల్ తీసిన మాత్రం 8.47 ఎకనామిక్ తో 14 వికెట్లు తీసి సత్తా చాటాడు.

 శిఖర్ ధావన్ :: 2019 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఓపెనర్ స్థానాన్ని కోల్పోయాడు. మళ్లీ వచ్చేందుకు ప్రయత్నించిన ఛాన్స్ మాత్రం దక్కలేదు.  కానీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో మాత్రమే ఎనిమిది మ్యాచ్ 43.14 సగటుతో 302 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడూ

 దినేష్ కార్తీక్ : అతడి కెరీర్ ముగిసిపోయింది. అతడు కామెంటేటర్ గా మారడం బెటర్ అని అనుకున్న వాళ్ల నోళ్లు ముయిస్తూ అసలు సిసలైన ఫినిషర్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్ లో తొమ్మిది మ్యాచ్ లలో 215 పరుగులు చేసి అదరగొట్టాడు. మెరుగైన ఫినిషెర్ గా కనిపిస్తున్నాడు.

 నటరాజన్  : ఒక సీజన్ తోనే టీమిండియాలో చోటు దక్కించుకుని ఆ తర్వాత గాయంతో టీమిండియాకు దూరమైన నటరాజన్.. ఇక 15 వ ఐపీఎల్ సీజన్ మరోసారి సత్తా చాటుతూ అదరగొడుతున్నాడు. 8 మ్యాచ్లో 8.41 ఎకనామిక్ 15 వికెట్లు తీసి సత్తా చాటాడు.


 ఉమేష్ యాదవ్ : ఇతని కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు గత రెండేళ్ల నుంచి టీమిండియా తరఫున ఆడింది అతి తక్కువే అని చెప్పాలి కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం 8 మ్యాచ్ లలో  7.43 ఎకనామిక్ 11 వికెట్లు తీసి సరికొత్త టెక్నిక్ తో ఆకట్టుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl