ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు లక్నో సూపర్ జయింట్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 42 వ మ్యాచ్ ఇంకాసేపట్లో మొదలు కానుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు వరుసగా 4 మరియు 8 స్థానాలలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు మరింత పటిష్టం చేసుకోవాలని లక్నో భావిస్తుండగా, పంజాబ్ మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలని తహతహలాడుతోంది. అయితే ఈ మ్యాచ్ లో ఎటు చూసినా పంజాబ్ ఫేవరెట్ అని తెలుస్తోంది. గత మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై ను ఓడించడం ద్వారా మరింత ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుంది. పంజాబ్ జట్టుకు రెండు ప్రధాన బలాలు ఉన్నాయి.

ఒకటి ఒక మంచి కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించడం సానుకూలాంశం అని చెప్పాలి. ఇక మరొకటి బౌలింగ్ విభాగం దుర్బేధ్యంగా ఉంది. గత వారం చెన్నై లాంటి జట్టును టార్గెట్ చేధించకుండా నిలువరించి మిగిలిన జట్లకు షాక్ ఇచ్చింది. ఈ రోజు మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో టీమ్ లో ఒక్క రాహుల్ ను త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పంజాబ్ దే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే లక్నో బలం మరియు బలహీనత రాహుల్ అవుతున్నాడు. కనుక పంజాబ్ లక్నో ను 180 లోపు పరిమితం చేస్తే విజయం దక్కుతుంది.

మరోసారి ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్, లివింగ్ స్టన్, రాజపక్షలు ఆడితే మరో విజయం ఖాయం. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ లక్నో బౌలింగ్ ను తక్కువ అంచనా చేయడానికి వీలు లేదు. ఆవేశ ఖాన్, హోల్డర్ మరియు బిష్ణోయ్ లు చాలా డేంజర్. కాబట్టి జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్ళాలి. మరి మాజీ పంజాబ్ ప్లేయర్ తో ఈ సమరం ఎలా ఉండబోతోందో చూడాల్సి ఉంది.  





 

మరింత సమాచారం తెలుసుకోండి: