సాధారణంగా డ్రీం హౌస్ కలను  నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అయితే సామాన్యులకు ఇలా డ్రీమ్ హౌస్ కల నెరవేర్చుకోవటం అనేది ఎంతో కాలం పడుతుంది. కానీ సెలబ్రిటీలకు క్రికెటర్లకు మాత్రం అతి తక్కువ సమయంలోనే ఇది సాధ్యమవుతుంది. ఒకసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగా గుర్తింపు వచ్చింది అంటే చాలు తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించడానికి అవకాశం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో యువ సంచలనం గా పేరు సంపాదించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా  తన డ్రీమ్ హౌస్ కల నెరవేర్చుకున్నాడు.


 కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుతంగా రాణిస్తూ ఉన్నా  విషయం తెలిసిందే. ఇక ఇటీవల భారీగా ఖర్చు పెట్టి మరి అతనికి ఇష్టమైన ఒక హౌస్ కొనుగోలు చేశాడు  10.5 కోట్ల పెట్టు పెట్టి ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడం గమనార్హం. పృథ్వీ షా కొనుగోలు చేసిన ఫ్లాట్ విలువ అతని ఐదేళ్ల ఐపీఎల్ శాలరీ తో సమానం అని చెప్పాలి. కాగా బాంద్రాలో కె సి రోడ్ లోని ప్రాజెక్ట్ 81 అపార్ట్మెంట్లో ఎనిమిదోవ ఫ్లోర్ ను కొనుగోలు చేసిసాడు పృథ్వీ షా. అతను కొనుగోలు చేసిన డ్రీం హౌస్ లో 2209 స్క్వేర్ ఫీట్లు కార్పెట్ ఏరియా 1654 ఫెయిర్ ఫీల్డ్ లో టెర్రస్ అత్యంత విశాలంగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ పిరమిడ్ డెవలపర్స్ నిర్మించారు.


 ప్రస్తుతం ఢిల్లీ కాపిటల్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పృద్వి షా  ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు తొమ్మిది మ్యాచ్ లలో  259 పరుగులు సాధించాడు. కాగా ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్న పృథ్వీ షా ప్రస్తుతం బౌండరీలతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు అనే చెప్పాలి. 2018 లో తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఇతన్ని విషయంలో 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవల 7.5 కోట్ల తో అతని ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రిటైన్ చేసుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: