గత ఏడాది సీజన్ వరకు ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ లో కీలక ఆల్రౌండర్గా కొనసాగాడు హార్దిక్ పాండ్య. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిస్తే ఇక నాలుగు సార్లు కూడా ముంబై ఇండియన్స్ జట్టులో కీలక పాత్ర వహించాడు అనే చెప్పాలి. కానీ ఈ ఏడాది మాత్రం గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కెప్టెన్గా జట్టుకు ముందుకు నడిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ ఏడాది ఐపీఎల్ తీసుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా కొనసాగుతుంది గుజరాత్ టైటాన్స్. అయితే ఇటీవలే గుజరాత్ టైటాన్ జట్టులోకి ఒక ఆటగాడు వస్తే బాగుండునని కోరుకుంటున్నాడూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.


 ఆ ఆటగాడు ఎవరో కాదు కిరణ్ పోలార్డ్. ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు ఆటగాళ్ళు కూడా మంచి స్నేహితులు. చాలాకాలం పాటు ముంబై ఇండియన్స్ జట్టు తరపున కలిసి ఆడారు. అయితే మెగా వేలం సమయంలో హార్దిక్ పాండ్యాను ముంబై వదిలేస్తే పోలార్డ్ ను మాత్రం జుట్టుతోనే ఉంచుకుంది. ఇకపోతే ఇటీవలే ముంబై జట్టుతో ఉన్న మధుర జ్ఞాపకాలను హార్దిక్ పాండ్యా గుర్తు చేసుకున్నాడు. కొన్ని రోజుల కిందట కిరణ్ పోలార్డ్ తో చేసిన ఫన్నీ చాటింగ్ లోని పలు విషయాలు పంచుకున్నాడు.


 ఈరోజు కిరణ్ పోలార్డ్ బాగా ఆడాలి.. అయితే మేము మ్యాచ్ గెలవాలి అంటూ హార్దిక్  చెప్పుకొచ్చాడు. నువ్వు బాగానే ఉన్నావా అంటూ తనకు నేను మెసేజ్ లు పెడుతూ ఉంటాను. పోలార్డ్ మేము చాలా మిస్ అవుతున్నాం అని చెప్పాను.. అంతే కాదు నువ్వు వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడతావేమో అని సరదాగా ఆటపట్టిస్తూ ఉంటాను.. అంతేకాదు గుజరాత్ జట్టులోకి పోలార్డ్ రావాలి అన్నది నా కోరిక కానీ అది ఎప్పటికీ జరగదు అని నాకు తెలుసు. కానీ అలా పోలార్డ్ తో అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాను అంటూ హార్థిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: