సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో బ్యాట్స్ మెన్లు రనౌట్ అవ్వడం లేదా క్యాచ్ అవుట్ అవ్వడం లేదా క్లీన్ బౌల్డ్ అవ్వడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మాత్రం ఎవరూ ఊహించని విధంగా విచిత్రంగా చేజేతులారా వికెట్ పారేసుకుంటారు బ్యాట్స్మెన్లు. ఏకంగా తమ బ్యాట్ తోనే వికెట్లను గిరాటేసి వికెట్ కోల్పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి.


 ఇక ఇటీవల ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది ఉత్కంఠ భరీతంగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక టేబుల్ టాపర్ గుజరాత్ కి మరో ఓటమి తప్పలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు యువ ఆటగాడు సాయి సుదర్శన్ దురదృష్టం వెంటాడింది. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో సాయి సుదర్శన్ అనూహ్యంగా హిట్ వికెట్గా వెనుదిరిగాడు. 16 ఓవర్ లో కీరన్ పొలార్డ్ వేసిన ఆఖరి బంతిని స్వీప్ షాట్ ఆడటానికి సుదర్శన్ ప్రయత్నించాడు.


 అయితే పోలార్డ్ వేసిన షార్ట్ పిచ్ బంతి సరిగా అంచనా వేయలేక పోయిన సాయి సుదర్శన్ బ్యాలెన్స్ కోల్పోయి తన బ్యాట్ తో వికెట్లను కొట్టాడు. ఇక ఆ వేగానికి వికెట్ బెయిల్స్ ఎగిరి పడ్డాయి. దీంతో ఇక ఈ సీజన్ లో మొట్టమొదటి హిట్ వికెట్గా సాయి సుదర్శన్ రికార్డును నమోదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో కొంత మంది ఆటగాళ్లు ఇలాంటి చెత్త రికార్డ్ లను కలిగి ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl