ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను ఐపీఎల్ ప్రారంభం నుంచి గత ఏడాది సీజన్ వరకు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు మహేంద్రసింగ్ ధోని. తనదైన కెప్టెన్సీ తో అటు ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్ను ఒక ఛాంపియన్ జట్టుగా నిలబెట్టాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు మాత్రం కెప్టెన్సీ నుంచి తప్పుకొని జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. దీంతో ఇక రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్  ను ఎలా ముందుకు నడిపిస్తాడు అని అందరూ ఆశగా ఎదురుచూశారు.


 ఈ క్రమంలోనే  అభిమానులందరికీ కూడా నిరాశ ఎదురైంది అన్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగించి. వరుస ఓటములతో సతమతమైన కెప్టెన్గా రవీంద్ర జడేజా సక్సెస్ కాలేకపోయాడు. అదే సమయంలో ఒత్తిడిలో ఇక ఆటగాడిగా కూడా రాణించలేకపోయాడు అని చెప్పాలి. దీంతో అనూహ్యమైన నిర్ణయం తీసుకుని కెప్టెన్సీని వదులు కుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. కొంతమంది జడేజా తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తే మరికొంత మంది మాత్రం విమర్శలు చేశారు.



 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ధోని నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సి  జడేజా అందుకోవడం చూసి ఎంతో సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు జడేజా పై జాలి కలుగుతుంది అని చెప్పుకొచ్చాడు. జడేజా నైపుణ్యం ఉన్న క్రికెటర్.. ఒత్తిడి ఉన్నప్పుడు కెప్టెన్సీ వదులుకోవడం క్లిష్టమైన అంశం.. దీన్ని అవమానకరంగా భావిస్తాము. అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సి వదులుకున్న ప్పుడు  కూడా నాది ఇదే పరిస్థితి. జడేజా తీసుకున్న నిర్ణయం అతని గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: