భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా.. రికార్డుల రారాజుగా రన్ మెషిన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. కానీ గత కొంత కాలం నుంచి పామ్ కోల్పోయి తీవ్రస్థాయిలో నిరాశపరుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్లో అయితే కనీసం పరుగులు చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు.. వరుసగా మ్యాచ్ లలో డకౌట్ అవుతూ అభిమానులను తీవ్రంగా నిరాశ లో ముంచెస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే రానున్న టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు కోహ్లీకి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ప్రతి ఆటగాడు కెరీర్ లో ఇలాంటి దశ ఉంటుందని.. అయితే విరాట్ కోహ్లీ కొన్నాళ్ళ పాటు రెస్ట్ ఇస్తే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. మళ్లీ ఫుల్ జోష్ తో విరాట్ కోహ్లీ తిరిగి వస్తాడు అంటూ మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై వేటు పడబోతుందా అంటే అవును అనే అంటున్నాయి బిసిసీఐ వర్గాల. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా ఐర్లాండ్ సిరీస్ లకు పక్కన పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది. విశ్రాంతి పేరుతో కోహ్లీ పై వేటు వేసేందుకు బిసిసీఐ అంతా సిద్ధం చేసుకుందట.


 ఇక టీమిండియా సెలెక్టర్లు ఈ విషయాన్ని ముందుగానే విరాట్ కోహ్లీకి చేరవేసే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది. కాగా విరాట్ కోహ్లీ పక్కన పెట్టాలి అనే విషయంపై ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ  నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనే విషయంలో కోహ్లీ అభిమతాన్ని కూడా సెలక్షన్ కమిటీ పట్టించుకునే పరిస్థితి లేదని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అజింక్య రహానే చటేశ్వర్ పుజారా లను ఎలాగైతే టెస్టు జట్టు నుంచి తప్పించారో కోహ్లీ విషయంలో కూడా ఇదే ఫార్ములా అప్లై చేయబోతున్నారట. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్తలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: