ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ లో అడుగు పెట్టేసింది. ఇక ఇప్పుడు గుజరాత్ ఆడబోయే మ్యాచ్ లలో విజయం సాధించిన సాధించకపోయినా పెద్దగా పోయేది ఏమీ లేదు అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం సంతోషం లో మునిగి పోయిన గుజరాత్ టైటాన్స్  జట్టు తాము ఉంటున్న హోటల్ లోనే ఫుల్ చిల్ అవుతుంది అని చెప్పాలి. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ జట్టును హార్దిక్ పాండ్యా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు.


 తనదైన కెప్టెన్సీ వ్యూహాలతో జట్టుకు విజయం అందించడమే లక్ష్యంగా ప్రతి అడుగు వేశాడు హార్దిక్ పాండ్యా. అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా గుజరాత్ జట్టును అగ్రస్థానంలో నిలిపాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తో అందరిని ఇంప్రెస్ చేసిన నేపథ్యంలో ఇక దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్కు  సీనియర్లకు విశ్రాంతి ఇస్తే టీమిండియా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. ఇదిలావుంటే ఇటీవల హార్దిక్ పాండ్యా తన సహచర ఆటగాళ్లు అందరితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఈ క్రమంలోనే అందరూ ఆటగాళ్లు కూడా హాయిగా పాటలు పాడుకుంటూ సరదాగా గడిపారు. ముందుగా విజయ్ శంకర్, సాయి సుదర్శన్ పాట పాడుకుంటూ ఉండగా.. అంతలోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అక్కడికి వస్తాడు. దీంతో హార్దిక్ పాండ్యా ఫేవరెట్ పాట పాడుదాం అని అందరు ఫిక్స్ అవుతారు  ఈ క్రమంలోనే వై దిస్ కొలవెరి అంటూ అందరూ కలిసి పాట పాడుతారు. ఇలా గుజరాత్ ఆటగాళ్లు అందరూ కూడా ఎంజాయ్ చేసిన వీడియోని జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: