ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ఎంత చెత్త ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదుసార్లు చాంపియన్ అయిన జట్టు కనీస స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.. వరుస పరాజయాల నేపథ్యంలో కొన్ని మ్యాచ్లు మిగిలి వుండగానే ఇక ప్లే అఫ్ అవకాశాలను కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పుడు వరకు బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ వచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గురువు సచిన్ టెండూల్కర్ కు గురుదక్షిణ ఇచ్చే అవకాశం వచ్చిందని అర్జున్ టెండూల్కర్ ను తుది జట్టులో అవకాశం కల్పిస్థారని అందరూ అనుకున్నారు.


కానీ జట్టులో బెంచ్ కే పరిమితమైన అందరూ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు కానీ అర్జున్ టెండూల్కర్కు మాత్రం అవకాశం రాలేదు. దీంతో రోహిత్ శర్మ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే అర్జున్ టెండూల్కర్కు తుది జట్టులో అవకాశం కల్పించలేదు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. రోహిత్ శర్మ నువ్వు గురువు సచిన్ టెండూల్కర్ కు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ ప్రశ్నించారు.


 ఈ క్రమంలోనే తుది జట్టులోకి అర్జున్ టెండూల్కర్ ను సెలెక్ట్ చేయకపోవడంపై ఇటీవల ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ క్లారిటీ ఇచ్చాడు. అర్జున్ టెండూల్కర్ ఇంకా పూర్తిగా రాటుదెలలేదు. అతను ఇంకా కొద్దిగా పని చేయాల్సి ఉంది. సచిన్ వారసుడిగా ముంబై ఇండియన్స్ టీం తరఫున ఆడుతున్నప్పుడు అతనిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు ఫ్యాన్స్.  అవకాశం దక్కించుకున్నప్పుడు అతను అంచనాలను అందుకోవాలి. తుది జట్టులోకి వచ్చే ముందు అతను ఇంకా చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అతను ఎంతో కష్టపడుతున్నాడు. అయితే అది తుది జట్టులోకి వచ్చేందుకు సరిపోదు అతని ఆటతీరు లో మార్పు వచ్చిందని భావిస్తే  తప్పకుండా ఆడిస్తాము అంటూ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: