సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటే చాలు బ్యాట్స్మెన్లు అందరూ కూడా తమ బ్యాటింగ్ కి పదును పెడుతూ ఉంటారు. బౌలర్ ఎవరైనా సరే వీరవిహారం చేయాలి అని మైండ్ లో ముందుగా ఫిక్స్ అయ్యి బరిలోకి దిగుతున్నారు. ఇక రావడం రావడమే బౌండరీలతో రెచ్చి పోతూ ఉంటారు. కోర్ బోర్డు ను  పరుగులు పెట్టిస్తున్నారు అయిన విషయం తెలిసిందే. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు టీ-20 ఫార్మెట్లో బౌలర్ల పై బ్యాట్స్ మెన్లు విరుచుకు పడే తీరు అటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పాలి. సాధారణంగా టి20 ఫార్మాట్లో 180 స్కోర్ వచ్చిందంటే మంచి స్కోరు అని చెబుతూ ఉంటారు. 200 స్కోర్ చేస్తే భారీ స్కోరు చేధించటం కష్టం అని అంటూ ఉంటారు.


 ఇక అంతకు మించి స్కోర్ వచ్చిందంటే ఆ జట్టుదే విజయం అని అందరూ ఫిక్స్ అయి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల టీ-20 ఫార్మెట్లో  బ్యాట్స్మెన్లు విజృంభించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇక ఈ టోర్నమెంట్లో ఒక మ్యాచ్లో వార్ వన్ సైడ్ గా మారిపోయింది. ఇటీవలే సర్రే, హాంప్షైర్ జట్ల మధ్య టి20 మ్యాచ్ జరిగింది.ఇందులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది హాంప్షైర్ జట్టు.


 ఇక సర్రే ను బ్యాటింగ్ దింపింది. విధ్వంసకర ఓపెనర్లు గా పేరున్న జాసన్ రాయ్ ఒకే ఒక పరుగు చేసి వికెట్ కోల్పోయాడు. మరో ఓపెనర్ జాక్స్ 64 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి 69 పరుగులు చేశాడు సామ్ కరణ్. ఇక ఇద్దరు కలిసి 74 బంతుల్లో 133 పరుగులు చేయడం గమనార్హం. ఇక బౌండరీల రూపంలో వీళ్లు కేవలం 19 బంతుల్లో 96 పరుగులు చేసి మైదానం మొత్తం దద్దరిల్లి పోయేలా చేశారు. చివర్లో నరైన్ వచ్చి 23 బంతుల్లో 52 పరుగులు చేయడంతో 228 స్కోర్ చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన హంప్ షేర్  150 పరుగులకే  కుప్పకూలిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: