ఇటీవలే సొంత గడ్డపై టీమిండియా ఆడిన మొదటి టీ20 మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. మొదట్లో టీమిండియా బ్యాటింగ్ చేసిన సమయంలో అటు టీమిండియాకు విజయం ఖాయం అనుకున్నట్లుగా పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం సౌత్ఆఫ్రికా ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో ఎంతో అలవోకగా టీమిండియాపై విజయం సాధించడం గమనార్హం. ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలం అవ్వడం తోనే సౌతాఫ్రికా కు విజయం వరించింది అని చెప్పాలి. బ్యాట్స్మెన్లు అదరగొట్టి 211 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు ఉంచినప్పటికీ.. భారత బౌలర్లు మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో విఫలం అయ్యారు.



 దీంతో ఆ ఐదు టీ20 సిరీస్ లో 1-0 తేడాతో ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు ఆధిక్యంలో కొనసాగుతోంది అని చెప్పాలి. అయితే ఇక సౌత్ఆఫ్రికాపై ఓటమితో టీమిండియా ప్రపంచ రికార్డును చేజార్చుకుంది అన్నది తెలుస్తుంది. టి20 కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా టీమిండియా వరుసగా అన్ని టి 20 వరుసగా మ్యాచ్ ల లో విజయం సాధిస్తూ వస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరుసగా 12 టీ20 మ్యాచ్ లలో విజయం సాధించింది టీమిండియా. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ రొమేనియా తో సమానంగా వరుసగా అత్యధిక టీ 20 లు గెలిచిన జట్టు గా కొనసాగుతోంది.


 ఈ క్రమంలోని సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి  మ్యాచ్లో విజయం సాధిస్తే వరుసగా ఎక్కువ టీ20  విజయాలు సాధించిన జట్టు గా రికార్డు సృష్టించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు ప్రపంచ రికార్డును భారత చేజార్చుకుంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం భారత్ ఆఫ్ఘనిస్తాన్ రొమేనియా వరుసగా 12 విజయాలతో కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా టీ 20 లలో టీమిండియాపై అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా సౌత్ ఆఫ్రికా అరుదైన రికార్డు సృష్టించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: