ఇండియాలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు ప్రత్యేకమైన మతం అన్నట్లుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక ఇండియాలో క్రికెట్ ఎంతో కాస్లీ క్రీడగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఒకసారి ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగు పెడితే ఇక కాసుల వర్షం కురిపిస్తుందని.. ఫైనాన్సిల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయనీ. ఊహించని విధంగా పాపులారిటీ వస్తుందని.. సంపాదన కూడా అదే రేంజ్లో ఉంటుందని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. ఇక ఐపీఎల్ ద్వారా ఒక్కో ఆటగాడు కోట్లు సంపాదిస్తూ ఉండటం చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి.



 కానీ ఇప్పటికి కూడా మన ఇండియాలో ఎంతో మంది క్రికెటర్లు ప్రోత్సాహకాలు లేక ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచులో ముంబై ఉత్తరాఖాండ్ పై 725 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఫస్ట్ క్లాస్ చరిత్రలోనే పెద్ద విజయం కావడం గమనార్హం. దీంతో ఉత్తరాఖండ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇకపోతే ఇప్పుడు ఉత్తరాఖండ్ ఆటగాళ్ల గురించి ఒక విషయం తెలిసి అందరూ జాలి పడకుండా ఉండలేకపోతున్నారు.


 దాదాపు గత 12 నెలల నుంచి ఉత్తరాఖండ్ రంజీ జట్టులో ఆటగాళ్ళు అందుకుంటున్న రోజువారి వేతనం కేవలం వంద రూపాయలు మాత్రమేనట. ఒక రంజి ఆటగాడికి ఇచ్చే రోజువారి వేతనంలో ఇది కేవలం ఎనిమిదో వంతు మాత్రమే.  దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అని  బీసీసీఐ నిబంధన ప్రకారం ఒక రంజీ క్రికెటర్ కు రోజుకు 1500 నుంచి ₹2000 ఇవ్వాలి. కానీ నిబంధనలు గాలికి వదిలేసి రోజుకు కేవలం వంద రూపాయలు మాత్రమే అందిస్తుంది ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్. కానీ కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తుంది. ఈ విషయంపై విచారణ జరపాలని పలువురు సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: