టీమిండియా లోకి  యువ సంచలనంగా ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్ అంటూ ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా తక్కువ సమయంలోనే టీమిండియాకు దూరమయ్యాడు. నిలకడ లేమి కారణంగా అతన్ని పక్కన పెట్టారు బిసిసిఐ సెలెక్టర్లు. ఇక అతను ఐపీఎల్ లో బాగా రాణించినా అతనికి అవకాశం కల్పించలేదు అన్న విషయం తెలిసిందే. టీమిండియాలో అవకాశం రాలేదు అన్న కోపం ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం పృథ్వి షా ఇన్నింగ్స్ లో బాగా కనిపించింది. ఇటీవలే మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఏకంగా క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు పృథ్వి షా.


 సాధారణంగానే పృథ్వీ షా అంటేనే మెరుపు ఇన్నింగ్స్ కి పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. అతను క్రీజులో ఉన్నాడు అంటే వరుసగా బౌండరీలు సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఇక పృథ్వీషా మెరుపు ఇన్నింగ్స్ ను ఇప్పటికే ఐపీఎల్ లో ఎన్నో సార్లు చూశామూ. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా ఇలాంటి ఇన్నింగ్స్ సార్లు ఆడాడు. ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై ఉత్తరప్రదేశ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఆదిక్యతతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ముంబై కెప్టెన్ పృథ్వి షా, జైశ్వాల్ ఓపెనర్లుగా ఎప్పటిలాగానే బరిలోకి దిగారు. అయితే పృథ్వీషా 71 బంతుల్లో 64 పరుగులు చేసి అవుటయ్యాడు.



 అయితే 64 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సమయంలో జట్టు స్కోరు 66 పరుగులు కావడం గమనార్హం. అంటే మరో వైపున ఉన్న యశస్వి జైస్వాల్ ఒక పరువు కూడా చేయలేదు. పూర్తి పరుగులు కూడా అటు పృథ్వి షా చేసినవే కావడం గమనార్హం. అయితే ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇక ఇది రెండోసారి జరిగింది.  ఇంతకుముందు 1888లో క్రికెట్ లో నార్త్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ పెర్సీ మెక్డొనాల్డ్ తొలి వికెట్ కోల్పోయిన సమయంలో 95.34 శాతం పరుగులు అతనివే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా 96.96 పరుగులు పృథ్వి షావి ఉండడం గమనార్హం. ఇలా 134 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టాడు పృథ్వి షా.

మరింత సమాచారం తెలుసుకోండి: