ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టులో షాహిన్ ఆఫ్రిది  స్టార్ బౌలర్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఎందుకో గత కొంత కాలం నుంచి షాహిన్ ఆఫ్రిదికీ ప్రతి విషయంలో ఎంతగానో కలిసి వస్తుంది. ఏకంగా నక్క తోక తోక్కినట్లే అదృష్టం తరచూ కలిసి వస్తూనే ఉంది. ఇక ఈ ఏడాది షహీన్ ఆఫ్రిది మంచి ఫామ్ లో అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెప్టెన్గా కూడా తన సమర్థత ఏంటో నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతనికి మరో సారి అదృష్టం వరించింది. ఏకంగా ఖరీదైన కారును బహుమతిగా వచ్చింది. అతనికి కారును బహుమతిగా ఇచ్చింది ఎవరో కాదు ప్రస్తుతం షాహీన్ అఫ్రిది కెప్టెన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న లాహోర్ కలందర్స్ జట్టు యజమాన్యం కావడం గమనార్హం.



 భారత్లో ఇండియన్ లీగ్ తరహాలోనే అటు పాకిస్తాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో లాహోర్ కలందర్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు షాహీన్ అఫ్రిది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అంచనాల లేకుండా బరిలోకి దిగిన లాహోర్ కలందర్స్ ను కేప్టెన్ గా  ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు.  ఈ క్రమంలోనే జట్టును ఏకంగా ఛాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అడుగు పెట్టిన నాటి నుంచి చివరి ఆఖరి స్థానానికి పరిమితమైన లాహోర్ జట్టు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్ గా మారిపోయిన తరువాత మాత్రం ఛాంపియన్ గా నిలిచింది.


 ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లాహోర్ ను ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిదికీ  కృతజ్ఞతగా ఏకంగా ఖరీదైనా స్వంకి కార్   గిఫ్టుగా అందజేసింది. కెప్టెన్ షాహీన్ అఫ్రిదికీ కృతజ్ఞతలు.. ఒక కెప్టెన్గా ఆటగాడిగా జట్టుకు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ప్రతిభతో పాటు గొప్ప ప్రయత్నాలకు ఫలితం ఎలా లభిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒక్కసారి ఛాంపియన్గా నిలిచినందుకే కారు గిఫ్టుగా ఇస్తే.. ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ విజేతగా.. 4 సార్లు నిలిపిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఎన్ని కార్లు గిఫ్ట్ గా ఇవ్వాలి అని అనుకుంటున్నారు భారత అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: