
తాను ఇప్పటివరకు ఆడిన కెప్టెన్లలో అందరిలో కూడా హార్దిక్ పాండ్యానే అత్యుత్తమ సారథి అంటూ యష్ దయాళ్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు కూడా టి20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇక అటు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో కూడా టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు హార్దిక్ పాండ్యా. కేవలం జట్టులో కీలక ఆటగాళ్లు మాత్రమే కొనసాగినా హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ద్వారా తన కెప్టెన్సీని నిరూపించుకోవడంతోనే ఇక బిసిసిఐ ఇలా వరుస అవకాశాలు ఇస్తుంది అని తెలుస్తోంది.
ఈక్రమంలోనే హార్దిక్ పాండ్యా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని.. ఇక హార్దిక్ పాండ్యా కు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసు అంటూ యష్ దయాల్ చెప్పుకొచ్చాడు. మనపై మనకు నమ్మకం ఉంటే బౌలర్లు సొంత నిర్ణయాలు తీసుకునేలా సపోర్ట్ చేస్తాడు. ఇక అది బౌలర్లలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు తన కెరియర్ లో ఆడిన కెప్టెన్స్ అందరిలో కూడా హార్దిక్ పాండ్య నే అత్యుత్తమం అంటూ చెప్పుకొచ్చాడు. ఆశిష్ నెహ్రా కూడా మొదటి నుంచీ నాకు మద్దతుగా ఉన్నాడు. మ్యాచ్ లో మొదటి ఓవర్లలో డెత్ ఓవర్ లలో సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయాలని ఆశిష్ నెహ్రా సలహా ఇచ్చాడు అని గుర్తుచేసుకున్నాడు యష్ దయాల్.