టీమిండియాలోకి అరంగేట్రం చేసిన మొదట్లో ఇక తన పేస్ బౌలింగ్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు ఉమేష్ యాదవ్. ఆ తర్వాత కాలంలో బౌలింగ్లో వైవిద్యం లోపించడంతో వికెట్లు పడగొట్టక పోవడమే కాదు భారీగా పరుగులు సమర్పించుకుంటూ వచ్చాడు. దీంతో ఉమేష్ యాదవ్ ప్రదర్శన ఆట జట్టుకు భారంగా మారి పోయింది. ఈ నేపథ్యంలోనే అతని జట్టు యాజమాన్యం పక్కనపెట్టేసింది అన్న విషయం తెలిసిందే. కాగా గత కొంత కాలం నుంచి ఉమేష్ యాదవ్ భారత జట్టులో 3 ఫార్మాట్లకు దూరమయ్యాడు.


 భారత జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఐపీఎల్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. కానీ అతనికి అవకాశం దక్కడం లేదు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ కోల్కతా తరపున ఆడిన ఉమేష్ మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ ఇప్పటివరకు టీమ్ ఇండియా నుండి పిలుపు మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం వెటరన్  పెసర్ ఉమేష్ యాదవ్ కు బంపర్ ఆఫర్ లభించింది అని తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ భారత జట్టు తరఫున కాదు ఏకంగా ఇంగ్లండ్ కౌంటీ టీమ్ తరఫున. పాకిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది స్థానం లో ఆడేందుకు  ఇంగ్లండ్ కౌంటీ టీం మిడిల్సెక్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఉమేష్ యాదవ్ జట్టుతో చేరబోతున్నాడు అంటూ మిడిల్సెక్స్ ఇక తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. 2022 డొమెస్టిక్ సీజన్ తోపాటు కౌంటీ ఛాంపియన్షిప్  వన్డే కప్ లో కూడా ఉమేష్ యాదవ్ అందుబాటులో ఉంటాడు అంటూ పేర్కొంది. ఓవర్సీస్ బౌలర్ కోటాలో ఉమేష్ యాదవ్ లాంటి బౌలర్ కోసమే ఎదురు చూశామని ఎట్టకేలకు  సుదీర్ఘ అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడు దొరికాడు అంటూ పేర్కొంది సదరు జట్టు యాజమాన్యం. ఇక అతని బౌలింగ్ తో మా జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: