భారత క్రికెట్ నియంత్రణ మండలి గత కొన్నేళ్ల నుంచి ఆదాయం విషయంలో మిగతా క్రికెట్ బోర్డుకు అందనంత ఎత్తులోకి వెళ్లి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి ఎక్కువ ఫండ్స్ ఇచ్చే క్రికెట్ బోర్డు.. రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కూడా బిసిసిఐ కొనసాగుతూ ఉంది. ఏకంగాక్రికెట్ ప్రపంచాన్ని మొత్తం శాసించే స్థాయికి ప్రస్తుతం బిసిసీఐ ఎదిగింది అన్న విషయం తెలిసిందే. ఐసీసీకి ఎక్కువ ఆదాయం అటు బిసిసిఐ దగ్గర నుంచి వస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు బీసీసీఐ ఎంత చెబితే అంత అన్న విధంగా ప్రస్తుతం ఐసీసీ కూడా  నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.



 ఇక ఇటీవల ఐపీఎల్ వేలం కారణంగా అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి సంపద రెట్టింపు అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంతో 40 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని పొందింది బీసీసీఐ. ఇలా బిసిసీఐ అంతకంతకు ఆదాయాన్ని పెంచుకుంటూ దూసుకుపోతుంది. అది సరేగాని ఇక ఇప్పుడు బీసీసీఐ ఆదాయం గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. బైజుస్ సంస్థ ఏకంగా బిసిసిఐకి 86.21 కోట్లు బాకీ పడినట్లు తెలుస్తోంది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే  ప్రస్తుతం ఇండియా జెర్సీ స్పాన్సర్గా కొనసాగుతుంది బైజుస్ సంస్థ. టీమ్ ఇండియా జెర్సీ పై కూడా బైజుస్ పేరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందం నేపథ్యంలో ఇక ఇప్పటి వరకు 86.21 కోట్ల రూపాయలు బైజూస్ సంస్థ భారత క్రికెట్ నియంత్రణ మండలి కి చెల్లించాల్సి ఉంది అన్నది తెలుస్తుంది. అయితే బీసీసీఐ తో ఒప్పందాన్ని పొడిగించామని నిబంధనల ప్రకారమే ఇక అన్ని చెల్లింపులు చేపడతామని బైజుస్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారని తెలుస్తోంది. కాగా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: