ఐదుగురు స్టార్ ఆటగాళ్లు జట్టులో లేకపోయినా అదిరిపోయే ప్రదర్శనతో వెస్టిండీస్ పర్యటనలో శుభారంభం చేసింది టీమిండియా. ఎంతో హోరా హోరీగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇక స్వల్ప తేడాతో విజయం సాధించి ఆధిక్యాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి వన్డే మ్యాచ్లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా రెండో మ్యాచ్లో కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే  రెండో వన్డే మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది టీమిండియా.


 అదే సమయంలో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు మరోసారి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమవుతోంది కరేబియన్ జట్టు. కాగా నేడు రెండో వన్డే మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు జరగబోతుంది. క్వీన్స్ పార్క్ ఓవల్ రెండో వన్డే కు వేదికగా మారింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే కీలకమైన మ్యాచ్లలో అటు వర్ష సూచన ఏమైనా ఉందా అని కొంతమంది అభిమానులు తెలుసుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగానే ఎప్పుడు వేడిగా ఉండే వాతావరణం వెస్టిండీస్ లో ఉంటుంది. దీంతో అక్కడ వర్షాలు వచ్చే అవకాశం తక్కువే.


 కానీ భారత జట్టు అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి వాతావరణం కాస్త చల్లగానే ఉంటుంది. మేఘాలు కమ్ముకోవడంతో వర్షాలు కూడా  అక్కడక్కడ పడుతూ ఉన్నాయి. ఇక రెండో వన్డే జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయ్. అయితే తొలి వన్డేకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఇక రెండో వన్డే కు వర్షం వచ్చే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు  25 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక రెండో వన్డే జరుగుతున్న మైదానంలో టీమ్ ఇండియా గతంలో ఆడిన 10 మ్యాచుల్లో  9 గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు కూడా టీమిండియాకు కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: