
తాజాగా జగిత్యాలలోని రాజారాం సర్పంచ్ మమత కూడా వరకట్నం వేధింపులకు గురయ్యారు. తనను భర్తతో పాటు అత్త, మామ, మరిది, ఆడబిడ్డలు, ఆడబిడ్డల భర్తలు అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.20 లక్షల అదనపు కట్నం కావాలని వేధిస్తున్నారని, తనపై దాడి కూడా చేశారని మమత పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త అశోక్ తీసుకెళ్లిన పెద్ద కుమారుడిని ఇప్పించాలని మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేశారు.
మల్లాపూర్ కు చెందిన దుర్శెట్టి శ్రీనివాస్, భారతి దంపతులకు రెండో కుమార్తె మమతను ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన అశోక్ ఇచ్చి ఆరేళ్ల క్రింద పెళ్లి చేశారు. వీరికి రజనీ కాంత్, హిమశశ్రీ, దాక్షాయని అనే ముగ్గురు సంతానం. గత ఎన్నికల్లో మమత సర్పంచ్ గా గెలిచింది. అయితే అదరపు కట్నం తీసుకు రావాలని చాలా రోజులుగా ఆమెను వేధిస్తున్నారు. దీంతో ఆమె వేధింపులు తట్టు కోలేక పోలీసులు ఫిర్యాదు చేసింది.
భర్తతో పాటు అత్త గంగ, మామ శంకర్, మరిది పూర్ణ చందర్, ఆడబిడ్డలు ఎదులాపురం వనిత, తునికి అనితపై ఫిర్యాదు చేసింది. అలాగే ఆడబిడ్డల భర్తలైన ప్రశాంత్, అనిల్ పై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.