ఈ రోజు ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక మరియు ఇండియా ల మధ్యన అతి కీలకం అయిన మ్యాచ్ జరుగుతోంది. సూపర్ 4 లో ఇండియా పాకిస్తాన్ తో ఓడిపోవడంతో ఇప్పుడు ఒత్తిడి అంతా ఇండియా పై పడింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ తో సహా జరిగే రెండు మ్యాచ్ లు గెలిస్తే ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇండియా టీమ్ మేనేజ్మెంట్ కూడా ఈ మ్యాచ్ కు ముందు అన్ని విషయాలపై చర్చలు జరిపి తుది జట్టును సెలెక్ట్ చేసింది. అయితే తుది జట్టు సెలక్షన్ పై అభిమానుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి.

ఈ ఆసియా కప్ కు సెలెక్ట్ అయిన స్పిన్నర్ లు అశ్విన్, జడేజా, చహల్ మరియు రవి బిష్ణోయ్ లు... రీసెంట్ గా గాయం కారణంగా జడేజా దూరం కావడంతో అక్షర పటేల్ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో అవకాశం దక్కించుకుంది కేవలం ఇద్దరు మాత్రమే, వారిలో జడేజా, రవి బిష్ణోయ్ మరియు చాహాల్  లు ఉన్నారు. జడేజా చహాల్ లు ఇద్దరూ కూడా అటు వికెట్లు తీయడంలో మరియు  పరుగులు నియంత్రించడంలో విఫలం అయిన సంగతి తెలిసిందే. కానీ మొన్న పాకిస్తాన్ తో మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రం పాకిస్తాన్ ఆటగాళ్లను పరుగులు చేయనీయకుండా కట్టడి చేయడంతో పాటు, కీలక ఆటగాడు అయిన బాబర్ ఆజమ్ ను ఔట్ చేశాడు.

ఒకవేళ ఇతని లాగా ఛాహల్ బౌలింగ్ చేసి ఉంటే ఇండియా ఓటమి నుండి ఖచ్చితంగా తప్పించుకునేది. కానీ అతను 43 పరుగులు ఇచ్చి ఇండియా ఓటమిలో పాలు పంచుకున్నాడు. కాగా ఈ రోజు శ్రీలంక తో జరుగుతున్న మ్యాచ్ లో బౌలింగ్ యూనిట్ లో మార్పులు ఊహించిందే.. కానీ పాక్ తో రాణించిన రవి బీష్ణోయ్ పై వేటు వేయడం తో చాలా మంది అభిమానుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఇది మంచి నిర్ణయం కాదని.. ఛాహాల్ ను తప్పించి ఈ యంగ్ స్పిన్నర్ ను కొనసాగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: