సాధారణంగా ఆసియా కప్ ప్రారంభమైందంటే.. దాయాది దేశాలు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠ భరితమైనవి అందరూ భావిస్తూ వుంటారు. ప్రేక్షకుల దగ్గర నుంచి ఆటగాళ్ల వరకు కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ను ఒక సాదాసీదా మ్యాచ్ కూడా చూడరు అని భావిస్తూ ఉంటారు. అందుకే ఇక ఈ రెండు జట్లు ఆడుతుంటే హై వోల్టేజ్  మ్యాచ్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం భారత్ పాకిస్థాన్ జట్లలో ఉండే ఆటగాళ్లు స్నేహితుల్లా కలిసి పోతూ ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మాత్రమే కాదు ఆఫ్ గ్రౌండ్ లో కూడా ఒకరితో ఒకరు సరదాగా ముచ్చటించూకోవడం ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకోవడం లాంటివి చేస్తున్నారు.



 కాగా కొన్ని కొన్ని సార్లు భారత్ పాకిస్తాన్ ఆటగాళ్ళ సరదా సంభాషణలు చూస్తూ ఉంటే మనం చూస్తుంది ఒకప్పటి పాకిస్తాన్ ఇండియా హై వోల్టేజీ మ్యాచేనా  అని ప్రేక్షకులకు అనుమానం వస్తూ ఉంటుంది. అయితే ఆసియా కప్ లో ఇటీవలే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కంటే ఎక్కువ రణరంగంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ప్రేక్షకుల మధ్య మాత్రమే కాదు మైదానంలో  ఉన్న ఆటగాళ్ల మధ్య కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది అనే చెప్పాలి.


 ఏకంగా మైదానంలో ఆటగాళ్లు కొట్టుకోవడానికి వెళ్లిన వీడియోలు కూడా వైరల్ గా మారిపోయాయ్. అదే సమయంలో ఇక ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోవడంతో స్టేడియం లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు పాకిస్తాన్ అభిమానులపై దారుణంగా దాడులకు పాల్పడటం సంచలనంగా మారింది. ఇదే విషయంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల  తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ వ్యాఖ్యానించాడు. ఒకవైపు పాకిస్తాన్ భారత్ ఆటగాళ్లు  హగ్ చేసుకుంటుంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు మాత్రం ఇలా చేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్. నిజంగానే మ్యాచ్ జరుగుతున్నప్పుడే కాదు మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా స్టేడియం మొత్తం రణరంగం గానే కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: