ఇటీవలి కాలంలో టి20 ఫార్మాట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి శాసించే స్థాయికి ఎదుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  టి20 ఫార్మాట్ కి వస్తున్న ప్రేక్షకాదరణ చూసి ఏకంగా క్రికెట్ పెద్దలు సైతం ఆశ్చర్య పోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రేక్షకులు క్రికెట్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే కావాలి అనుకున్నారో అటు టీ20 ఫార్మాట్ నుంచి అదే అందుతుంది అని చెప్పాలి.  ఇటీవలికాలంలో టి20 ఫార్మాట్ ను మరింత రసవత్తరంగా మార్చేందుకు అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ తీసుకు వస్తూ ఉండడం గమనార్హం ఈ క్రమంలోనే ఇక ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ టీ-20 ఫార్మెట్లో కొన్ని రకాల రూల్స్  తీసుకువస్తే మరింత బాగుంటుంది అన్న విషయం పై తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టి20 ఫార్మాట్ లో సరి కొత్త నిబంధన తీసుకురావాలి అంటూ అభిప్రాయపడ్డాడు. సూపర్ సబ్స్టిట్యూట్ నిబంధన తీసుకురావాలని ఐపీసీ ని కోరాడు రవిశాస్త్రి.  అయితే ప్రస్తుతం సబ్స్టిట్యూట్ గా వచ్చిన వ్యక్తి ఫీల్డింగ్  చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.  కానీ అలా కాకుండా టి20 క్రికెట్ లో సూపర్ సబ్స్టిట్యూట్ నిబంధన తీసుకురావాలని కోరుతూ ఉండడం గమనార్హం.


 ఇంతకీ సూపర్ సబ్స్టిట్యూట్ అంటే ఏమిటంటే ఇన్నింగ్స్ 10ఓవర్ అనంతరం ప్రతి జట్టు కూడా సూపర్ సబ్స్టిట్యూట్ ఆప్షన్ ని వాడుకోవచ్చు. ఈ రూల్ ప్రకారం సూపర్ సబ్స్టిట్యూట్ గా రాబోయే ఆటగాడికి సంబంధించిన వివరాలు  దానికి ముందే ఇక ఇరు జట్లు కూడా  ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇలా వచ్చిన ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ఈ రూల్ అంతర్జాతీయ టీ20 లో తీసుకువస్తే గేమ్ చేంజర్ గా  మారుతుందని అభిప్రాయపడ్డాడు రవిశాస్త్రి.  కాగా ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో ఈ సూపర్ సబ్స్టిట్యూట్ రూల్ తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: