టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు స్వదేశం వేదికగా టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో పాటు సౌత్ ఆఫ్రికా తో కూడా టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టి 20 సిరీస్ అటు వరల్డ్ కప్కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ గా మారే అవకాశం కూడా ఉంది. ఈ క్రమం లోనే టి20 సిరీస్ లో ఆడ బోయే జట్టు వివరాలను ఇటీవల బిసిసీఐ అధికారికం గా ప్రకటించింది. ఇందులో భాగంగా మహ్మద్ షమీ కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 దాదాపు తొమ్మిది నెలల సమయం తర్వాత టీ 20 జట్టు లో షమి స్థానం సంపాదించు కోవడం తో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోయారు. ఈ క్రమం లోనే మహ్మద్ షమి ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ లో బాగా రాణిస్తాడని వరల్డ్ కప్ జట్టులో కూడా స్థానం సంపాదిస్తాడు అని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయం  లో మహమ్మద్ షమి నీ  దురదృష్టం వెంటాడింది. కరోనా వైరస్ బారిన పడి చివరికి జట్టుకు దూరమయ్యాడు.


 ఇలాంటి సమయం లో అతని స్థానం లో ఉమేష్ యాదవ్ ను జట్టు లోకి తీసుకున్నారు.  అయితే ఉమేష్ యాదవ్ ను జట్టు లోకి తీసుకోవడం తో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ప్రసిద్ కృష్ణ గాయపడ్డాడు. సిరాజ్ కౌంటీలు ఆడుతున్నాడు. ఆవేశ్ ఖాన్ అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే ఉమేష్ యాదవ్ కి ఛాన్స్ ఇచ్చాము అంటూ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాక  ఐపీఎల్ లో అతడు చక్కగా బౌలింగ్ చేశాడు. జట్టులో ఒక సీనియర్ బౌలర్ ఉండాలని భావించాం అందుకే అతనికి ఛాన్స్ ఇచ్చినట్టు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: