ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న అందరూ కూడా వరుసగా తమ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి.  కొంతమంది ఫామ్ కోల్పోయామని రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇంకొంతమంది జట్టులో అవకాశాలు రావడంలేదని నిరాశతో చివరికి ఇక ఆట నుంచి తప్పుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇంకొంతమంది వయస్సు మీద పడిందని ఇక తమ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఇక మూడు ఫార్మాట్ లో కొనసాగుతున్న ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం కారణంగా ఏదో ఒక ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించి మిగతా ఫార్మాట్ లో కొనసాగుతూ ఉండడం అయితే ఇటీవల కాలంలో క్రికెట్లో ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెెన్ స్టోక్స్ సైతం గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. కెరియర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న బెన్ స్టోక్స్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు పెరగడం కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అంటూ తెలిపాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా ఆరోన్ పించ్ సైతం వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పేసాడు. టి20 కెప్టెన్ గా మాత్రమే కొనసాగుతున్నాడు.


 ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో సీనియర్ స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మోయిన్ అలీ కూడా గత ఏడాది టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇతను మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల ఇదే విషయం పై స్పందించిన మోయిన్ అలీ క్లారిటీ ఇచ్చాడు. ఇకపై టెస్టుల్లో రి ఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ తెలిపాడు. టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చిన్న హింట్ ఇవ్వడంతో దీని గురించి అందరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయంలో మోయిన్ అలీ యూటర్న్ తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది.ఇంగ్లాండ్ కోచ్ తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: