గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. సూర్య కుమార్ యాదవ్ ఆడే అద్భుతమైన ఇన్నింగ్స్ లకి క్రికెట్ ప్రేక్షకులందరూ ఫిదా అయిపోతున్నారు. అతని సొగసైన షాట్లు ఏకంగా మాజీ క్రికెటర్లను సైతం మంత్రం చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్టార్ బౌలర్ల బౌలింగ్లో కూడా చెడుగుడు ఆడేస్తూ సిక్సర్లు ఫోర్ లతో  చెలరేగిపోతున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ అటు జట్టులో ఉన్నాడు అంటే చాలు అతనికి మాన్ అఫ్ ది మ్యాచ్ దక్కుతుంది అన్నట్లుగా అతను ప్రదర్శన చేస్తున్నాడు.


 అందరూ అనుకుంటున్నట్లుగానే అతను ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా అందరికంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఎంతోమంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ రానున్న రోజుల్లో అందరి రికార్డులను చెరిపేస్తాడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రంఒక భారత బ్యాట్స్మెన్ ఒకరు ఏకంగా సూర్య కుమార్ యాదవ్ను దాటేసి నెంబర్వన్ స్థానంలోకి వచ్చేసాడు.


 ఆ ఆటగాడు ఎవరో కాదు శ్రేయస్ అయ్యర్. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఏకంగా 113 పరుగులు చేసి అజయమైన సెంచరీ తో జట్టును గెలిపించాడు శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్కు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇక ఇది ఐదవ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు అత్యధికంగా నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి సూర్య కుమార్ యాదవ్ ను వెనక్కి నెట్టిన శ్రేయస్ అయ్యర్ మొదటి స్థానంలోకి వచ్చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: