దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే భారత క్రికెట్లో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మాస్టర్ బ్లాస్టర్ గా మారిపోయాడు. అంతేకాదు భారత క్రికెట్ దేవుడిగా కూడా ఎంతో మంది అభిమానులు అతన్ని అభివర్ణిస్తూ  ఉంటారు అని చెప్పాలి.  అయితే సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో బ్యాటింగ్లో సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతను సాధించిన రికార్డులు మాత్రం ఇంకా చెక్కుచెదరలేదు అని చెప్పాలి.


 అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడు సచిన్ టెండూల్కర్ ప్రస్తావన వచ్చినా కూడా మూడు ఫార్మాట్లలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్లో సాధించిన రికార్డుల గురించి అందరూ చర్చించుకుంటారు. కానీ సచిన్ టెండూల్కర్ కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు బౌలింగ్లో కూడా పలు రికార్డులు నెలకొల్పాడు అన్న విషయం కేవలం కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. అంతే కాదు బౌలింగ్లో ఎంతోమంది దిగ్గజ బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెట్టి వికెట్ పడగొట్టాడు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. మూడు ఫార్మట్ లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 201 వికెట్లు తీశాడు సచిన్ టెండూల్కర్  సచిన్ చేతిలో అత్యధిక సార్లు వికెట్ కోల్పోయిన దిగ్గజాలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


 శ్రీలంక లెజెండరి బ్యాట్స్మెన్ మహిళా జయవర్ధనేని సైతం సచిన్ టెండూల్కర్ ఎక్కువసార్లు అవుట్ చేశాడు. అయితే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయే విధ్వంసం సృష్టించే స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ జయవర్ధనే  సచిన్ బౌలింగ్లో ఎంతో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలోనే మూడుసార్లు సచిన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇతనితో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణ తుంగ సైతం సచిన్ టెండూల్కర్ బౌలింగ్లో మూడు సార్లు పెవిలియన్ చేరాడు. సచిన్ టెండుల్కర్ బౌలింగ్లో అవుట్ అయిన ప్లేయర్ల జాబితాలో జింబాబ్వే గ్రేట్ బ్యాట్స్మెన్ ఆండీ ఫ్లవర్ కూడా ఉన్నాడు. ఏకంగా సచిన్ చేతిలో నాలుగు సార్లు వికెట్ కోల్పోయాడు.  ఇక మరో దిగ్గజం బ్రియాన్ లారా  సైతం సచిన్ స్పిన్ బౌలింగ్లో నాలుగు సార్లు వికెట్ కోల్పోవడం గమనార్హం. ఇక పాకిస్తాన్ ఆటగాడు ఇంజమాముల్ హాక్ సైతం సచిన్ బౌలింగ్లో ఏకంగా ఏడుసార్లు అవుట్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: