గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఉత్కంఠ భరితమైన మ్యాచ్లతో క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచిన మహిళల ఆసియా కప్ ప్రస్తుతం తుది అంకానికి చేరుకుంది. ఆసియా కప్ లో భాగంగా అటు కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల థాయిలాండ్ ను ఓడించిన టీమిండియా జట్టు ఫైనల్ లో అడుగుపెట్టింది. అదే సమయంలో ఇటీవల సెమీఫైనల్ మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్- శ్రీలంక మధ్య ఉత్కంఠ భరితమైన పోరు జరిగింది.


 నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో చివరికి ఒక్క పరుగు తేడాతో శ్రీలంక విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది అని చెప్పాలి. ఇక ఈ పోరులో ఏ జట్టును తక్కువ చేయడానికి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసింది. 123 పరుగుల లక్ష్యంతో బలిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు అలవోకగా విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ శ్రీలంక బౌలింగ్ విభాగం పట్టు బిగించడంతో చివరికి టార్గెట్ చేదించలేకపోయారు. తద్వారా ఒక పరుగు తేడాతో శ్రీలంక విజయం సాధించింది.


 అయితే సెమీఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టిన తర్వాత అటు శ్రీలంక మహిళా క్రికెటర్లు అందరూ కూడా మ్యాచ్ అనంతరం స్టేడియం గ్రౌండ్లో కలిసికట్టుగా డాన్స్ చేశారు. ఇక మహిళా క్రికెటర్ల చక్కని డాన్స్ స్టెప్పులు చూస్తే అసలు వీళ్ళు క్రికెటర్ల లేకపోతే డాన్సర్ల అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ముందుగా తీన్మార్ స్టెప్పులతో తమ డాన్స్ ప్రారంభించిన మహిళా క్రికెటర్లు ఆ తర్వాత అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ చేసి ఆకట్టుకున్నారు అని చెప్పాలి. కాగా ఈనెల 15వ తేదీన భారత్ శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: