దయాధులు సమరానికి వేలయ్యింది. ఇక వరల్డ్ కప్ ప్రకటన వచ్చిన నాటి నుంచి కూడా ప్రతి రోజును కౌంట్ చేసుకున్న అభిమానులు ఇక ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు సిద్ధమయ్యారు. రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మేల్ బోర్న్ స్టేడియం వేదికగా దాయాధుల సమరం ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇరుజట్లకు కూడా వరల్డ్ కప్ లో ఇదే మొదటి మ్యాచ్ కావడం గమనార్హం. అయితే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది టీమిండియా. ఇక ఏడాది వరల్డ్ కప్ లో ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది.


 ఇక ఇప్పుడు కొత్త కెప్టెన్ రోహిత్ సారధ్యంలో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇక రోహిత్ సేన ఎంతో పటిష్టంగా ఉంది అని చెప్పాలి. అదే సమయంలో భారత్ పై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయాలని పాకిస్తాన్ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అయితే గత ఏడాది వరుసగా టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చి ఇక టీమ్ ఇండియా ఓటమిని శాసించిన పాకిస్తాన్ స్టార్ ఫేసర్ షాహీన్ ఆఫ్రిది ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది భారత స్టార్ ఓపెనర్ కెప్టెన్రోహిత్ శర్మ ఎదురుపడితే ఆ మాజానే వేరు  అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


 ఎందుకంటే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో షాహిన్ ఆఫ్రిది కీలకమైన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వికెట్లను తీశాడు. ఇన్ స్వింగర్ బంతులతో ముప్పు తీప్పులు పెట్టి స్టార్ బాట్స్మన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను గోల్డెన్ డకౌట్ గానే పెవిలియన్ చేర్చాడు. ఇక తర్వాత కేఎల్ రాహుల్ ను 3 పరుగుల వద్ద వికెట్ తీసేసాడు. ఇక విరాట్ కోహ్లీ వికెట్ కూడా షాహిన్ ఆఫ్రిది తీయడం గమనార్హం. ఈ క్రమంలోనే గత ఏడాది షాహిన్ ఇన్ స్వింగర్ కి వికెట్ సమర్పించుకొని గోల్డెన్ డకౌట్ గా వెను దిరిగిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు అతని బంతులకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే వీరిద్దరూ ఎదురుపడితే ఇక ఆ మజానే వేరు అంటూ కామెంట్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: