
ఇటీవల కాలంలో చిన్నారులు ఆడుకుంటూ రోడ్డు మీదకి వెళ్తున్న సమయంలో ఏకంగా వారి మీద నుంచి వాహనాలు వెళ్లడం లాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ కొంతమంది చిన్నారులు మాత్రం ఇక ఇలాంటి ప్రమాదాల బారిన పడినప్పటికీ మృత్యుంజయులుగా నిలుస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ప్రమాదానికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి.
ఈ వీడియోలో చూసుకుంటే ఓ బాలిక తన చిన్న సైకిల్ నడుపుకుంటూ రోడ్డు మీదికి వచ్చింది. అయితే అటువైపుగా దూసుకు వచ్చిన ఒక కారులో ఉన్న డ్రైవర్ ఆ చిన్నారిని గమనించలేదు. ఈ క్రమంలోనే ఆ కారు ఆ చిన్నారిపై నుంచి పోయింది. ముందుగా బాలికను బలంగా కారు ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో ఫ్రంట్ వీల్ బాలిక మీద నుంచి వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తు బాలికకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మృత్యుంజయురాలుగా నిలిచిన చిన్నారి ఏమి జరగనట్లు బయటకు వచ్చి లేచి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.