మరికొన్ని గంటల్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ ఉత్కంఠ భరితమైన పోరుని చూసేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం సిద్ధమైంది. ఇక మరోసారి పూర్తిస్థాయి ప్రేక్షకులు మధ్య జరిగే దాయాదుల పోరు పైసా వసూల్ మ్యాచ్ గా మారిపోతుందని అందరూ అనుకుంటున్నారూ. ఇది ఇలా ఉంటే ఇక ఇప్పుడు అందరూ చర్చించుకుంటుంది మాత్రం షాహీన్ ఆఫ్రిది గురించి అని చెప్పాలి. పాకిస్తాన్ జట్టులో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న షాహిన్ టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఎలా ఎదుర్కోబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.


 ఎందుకంటే గత ఏడాది టి20 ప్రపంచ కప్ లో భారత ఓటమిని శాసించింది.. టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చి.. ఇక భారత వ్యూహాలను కకలవికలం చేసింది ఇక ఈ బౌలర్ కావడం గమనార్హం. ఇక ఇప్పుడు ఇతన్ని భారత బ్యాట్స్మెన్లు  ఎలా ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరంగా మారగా అతనిని ఎదురుకోవడం ఎంతో సులభం అంటూ భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక సలహా ఇచ్చాడు. ఒకవేళ మీరు షాహిన్ ను ఎదుర్కోవాల్సి వస్తే ఏం చేసేవారు అంటూ ప్రశ్నించగా.. నేను అతన్ని ఎదుర్కొనే ఛాన్స్ లేదు కాబట్టి దాని గురించి ఆలోచించలేదు అంటూ నవ్వుతూ సమానం ఇచ్చాడు. అదే సమయంలో భారత బ్యాట్స్మెన్లకు పలు సూచనలు చేశాడు.


 షాహిన్ ఆఫ్రిది ఎటాకింగ్ బౌలర్. వికెట్లను పడగొట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతాడు. పిచ్ మీద బలంగా బంతిని సంధించడంతోపాటు స్వింగ్ చేయగలడు. ఫ్రంట్ ఫుట్ లోకి వచ్చిన బ్యాటర్లతో కూడా బంతిని తాకకుండా చేసే సామర్థ్యం అతనికి ఉంది. అందుకే షాహిన్ బౌలింగ్ ను ఎదుర్కొనేటప్పుడు స్ట్రైట్ గా ఆడేందుకు ప్రయత్నించాలి. బ్యాట్, చేతులు వి ఆకారంలో ఉండాలి.. ఒకసారి బ్యాటర్ బ్యాక్ ఫుట్ తో ఆడేందుకు వెళ్ళిన తర్వాత ఫ్రంట్ ఫుట్ కు అస్సలు రావొద్దు. ఒకవేళ ఫ్రంట్ ఫుడ్ తో ఆడేందుకు ప్రయత్నించి మళ్లీ బ్యాక్ ఫుట్ వస్తే ఎల్బీ గా అవుట్ అవ్వడం ఖాయం అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: