ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా మేల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో  టీమ్ ఇండియా ఓటమి ఖాయం అనే పరిస్థితుల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. ఇక జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించడమే కాదు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక పాకిస్తాన్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియ అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ వీరోచితమైన ఇన్నింగ్స్ గురించి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది అని చెప్పాలి. తన బ్యాటింగ్లో క్లాస్ ను చూపిస్తూ పరుగుల దాహం తగ్గలేదని నిరూపించాడు.


 అయితే మ్యాచ్ అనంతరం కామెంటేటర్ రవి శాస్త్రి తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మనం చివరి వరకు క్రీజు లో ఉంటే విజయం సాధించగలమని పాండ్యా నాతో చెప్పాడు. ఇప్పటివరకు నా టి20 కెరియర్ లో మొహాలీలో బెస్ట్ ఇన్నింగ్స్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అది మేల్ బోర్న్ గా మారిపోయింది  అప్పుడు 52 బంతుల్లో 82 పరుగులు చేస్తే ఇప్పుడు 53 బంతుల్లో 82 పరుగులు చేశాను అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. దీంతో మొహాలీలో కోహ్లీ ఇన్నింగ్స్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.


 అయితే 2016లో ఐసీసీ టీ20 ప్రపంచ ప్రపంచ కప్ కి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇక సూపర్ 10 లో భాగంగా గ్రూప్-2 లో ఉన్న భారత్,ఆస్ట్రేలియా మధ్య మొహాలి వేదికగా మ్యాచ్ జరిగింది. తొలిత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లల లో 6 వికెట్ల  నష్టానికి 160 పరుగులు చేసింది. ఆ తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. శిఖర్ ధావన్ 13, రోహిత్ శర్మ 12,సురేష్ రైనా 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.  అచ్చం పాకిస్తాన్తో మ్యాచ్ లాగానే 7 ఓవర్లలో  టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రిజ్లో కోహ్లీ ఉన్నాడు. ఒకవైపు నుంచి బలమైన ఆసీస్ ఫేస్ దళం దాడి చేస్తుంది   సింగిల్ డబుల్ తీసి ఇన్నింగ్స్ నిర్మించాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ. ఇక తర్వాత 18 బంతుల్లో 39 పరుగులు కావాలి. ఇక అప్పుడు కూడా విరాట్ కోహ్లీ విజృంభించాడు. చివరి ఓవర్లో  నాలుగు పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనే చివరి ఓవర్ తొలి బంతిని బౌండరీ కొట్టి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. అప్పుడు 52 బంతుల 82 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: