ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఒకటిగా కొనసాగుతున్న పాకిస్తాన్ కు వరుసగా పరాజయాలు ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా వరుసగా పాకిస్తాన్ ఓడిపోతూ ఉండడం.. ఇక ఆ జట్టు సెమీస్ అవకాశాలను క్రమక్రమంగా మూసుకుపోయేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. వరల్డ్ కప్ లో భాగంగా మొదట చిరకాల ప్రత్యర్థి అయిన భారత్తో మ్యాచ్ ఆడింది పాకిస్తాన్ జట్టు.


 ఒకానొక దశలో పాకిస్తాన్ గెలుస్తుందేమో అనుకునే పరిస్థితి ఉన్నప్పటికీ ఊహించని రీతిలో భారత్ మాత్రం విజయం సాధించింది. వరల్డ్ కప్ లో విజయం సాధించి బోని కొట్టాలనుకున్న పాకిస్తాన్ కు నిరాశ తప్పులేదు. ఇక ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ తప్పక గెలుస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో పసికూన జింబాబ్వే పాకిస్తాన్ ను ఓడించింది. ఏకంగా ఒక పరుగు తేడాతో పాకిస్తాన్ పసి కూన చేతిలో పరాజ్యం పాలైంది. 130 పరుగుల టార్గెట్ కూడా ఛేదించలేక  చేతులెత్తేసింది.


 ఈ క్రమంలోనే ఒకవైపు వరల్డ్ క్లాసు బౌలర్లు, బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్  జింబాబ్వే చేతిలో ఓడిపోవడంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై ఆ దేశ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. జింబాబ్వే చేతిలో పాక్ ఓటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాప్, మిడిల్ ఆర్డర్ మంచి ఫామ్ లో ఉన్న కూడా జట్టుకు గెలుపు ఎందుకు కష్టమవుతుంది అంటూ ప్రశ్నించాడు. పాకిస్తాన్ కు చెత్త కెప్టెన్ ఉన్నాడు   నవాజ్ ఫైనల్ ఓవర్ వేసిన మూడు మ్యాచ్లు ఓడిపోయాము. షాహిన్ ఆఫ్రిది ఫిట్నెస్, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. బాబర్ మూడో స్థానంలో బాటింగ్ కి వస్తే మంచిది అంటూ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: