ఇటీవల భారత జట్టు వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ఆఫ్రికా తో మ్యాచ్ ఆడింది అని చెప్పాలి. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు ఒక వైపు బౌలింగ్ విభాగంలో మరోవైపు బ్యాటింగ్ విభాగంలో పటిష్టమైన టీమిండియాకు సరైన సమవుజ్జి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు హోరాహోరీగా పోరు జరుగుతుందని.. క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా భావించారు. అందరు ఊహించినట్లుగానే ఇరు జట్లు కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు పోరును కొనసాగించాలి అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు పోరాడి ఓడింది అని చెప్పాలి.


 ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బౌలర్లు భారత బ్యాట్స్మెన్లను పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యారు. ఇక అందరూ కూడా తక్కువ పరుగులు మాత్రమే చేసి చివరికి వికెట్ చేజార్చుకోవడం గమనార్హం. అయితే భారత్ ఇన్నింగ్స్ సమయంలో కేవలం సూర్య కుమార్ యాదవ్ మాత్రమే అటు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఇక ఒత్తిడిలో కూడా ఎంతో అరుదైన షాట్లు ఆడుతూ తనదైన బ్యాటింగ్ తో మైమరిపించాడు సూర్య కుమార్ యాదవ్. ఇక అతను చివరి వరకు ఉండి ఉంటే భారత్ భారీ చేసి స్కోరు చేసేదని అందరు అనుకున్నారు. కానీ కీలక సమయంలో సూర్య కుమార్ అవుట్ కావడంతో ఇక టీమిండియా తక్కువ పరుగులకు పరిమితమైంది.


 అయితే ఇటీవల కోహ్లీ పాకిస్తాన్ పై ఆడిన ఇన్నింగ్స్ గొప్పది అయినప్పటికీ.. కోహ్లీ కంటే సూర్యకుమార్ యాదవ్ డేంజరస్ బ్యాట్స్మెన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన గౌతమ్ గంభీర్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా పై ఒత్తిడిలో అద్భుత బాటింగ్ చేసిన సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు. నా ప్రకారం టి20 చరిత్రలో భారత ఆటగాడి బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై అటు కోహ్లీ ఫాన్స్ మాత్రం ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. మొన్న పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ సంగతేంటి అంటూ గౌతమ్ గంభీర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: