ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు టీమ్ ఇండియా ఎంతో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. వరుసగా మ్యాచ్ లు ఆడుతూ కప్పు గెలవడమె లక్ష్యంగా ముందుకు సాగుతుంది. రోహిత్ శర్మ సారథ్యంలో అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే కాస్తయినా గ్యాప్ లేకుండా టీమిండియా మళ్లీ వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీ అవ్వబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా పర్యటనకు సంబంధించిన వివరాలను కూడా అటు బీసీసీఏ ప్రకటించింది.


 ఈ మేరకు ప్రపంచ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ లో పర్యటించబోతుంది టీమ్ ఇండియా. అక్కడ వన్డే టి20 సిరీస్లో ఆడబోతుంది అని చెప్పాలి. ఇకపోతే గత కొంతకాలం నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీకి సెలెక్టరు విశ్రాంతి ప్రకటించారు. అదే సమయంలో ఇక రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వన్డే ఫార్మాట్ కు శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ అప్పగించారు.


 ఇదిలా ఉంటే రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ  చేపట్టబోయేది ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడల్లా హార్దిక్  పాండ్యా పేరు తిరమీదికి వస్తుంది అన్న విషయం తెలిసిందే. గతంలో ఓసారి టీమిండియా పగ్గాలు అందుకున్న హార్దిక్  ఒత్తిడి లేకుండా కెప్టెన్సి చేపట్టి తన సారధ్య వ్యూహాలతో అదరగొట్టాడు. ఇక ఐపీఎల్ లో కూడా ఇప్పటికే కెప్టెన్గా నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి టీమిండియా కెప్టెన్సీ అందుకున్నాడు. దీంతో ఇక టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ అతనే అంటూ మరోసారి చర్చ తెర మీదికి వచ్చింది అని చెప్పాలి.


 కాగా టీమిండియ ఆడబోయే సిరీస్ లకు సంబంధించిన జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

న్యూజిలాండ్‌తో తలపడే టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్‌తో ఆడే వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, చాహల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్‌తో ఆడే టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్

బంగ్లాదేశ్‌తో ఆడే వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రాజ్‌దత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: