టి20 వరల్డ్ కప్ లో బిజీగా ఉన్న టీమిండియా ఇక ఈ మెగా టోర్ని ముగియగానే వరుసగా వివిధ దేశాల పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్లో టీమిండియా బంగ్లాదేశ్ లో పర్యటించేందుకు సిద్ధమైంది. అక్కడ 3 వన్డే మ్యాచ్ల సిరీస్ తో పాటు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ఆడబోతుంది. ఇక డిసెంబర్ 4వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ పర్యటన సాగబోతుంది. ఇకపోతే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లబోయే భారత జట్టు వివరాలను ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల బిసిసిఐ ప్రకటించిన జట్టు వివరాలు చూసుకుంటే జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన కొంతమంది ఆటగాళ్లకు నిరాశ ఎదురయింది. అదే సమయంలో ఇక బంగ్లాదేశ్ తో తలబడబోయే టెస్ట్ సిరీస్ లో భాగంగా తెలుగు క్రికెటర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయినా కేఎస్ భరత్ కు అవకాశం దక్కింది. అయితే టెస్ట్ స్పెషలిస్టు బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న హనుమ విహారికి మాత్రం ఉద్వాసన పలికినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది యువ ఆటగాళ్లను కాదని కె.ఎస్ భరత్ అవకాశం దక్కగా.. అతను ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక ఈ సిరీస్ లో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆ తర్వాత టెస్ట్ సిరీస్ ఆడబోతుంది టీమిండియా.. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

బంగ్లాదేశ్‌తో ఆడే టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్

బంగ్లాదేశ్‌తో ఆడబోయే వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రాజ్‌దత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: