టి20 ప్రపంచక ప్రారంభానికి ముందు టీమిండియా కు బిగ్ షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక బౌలర్గా ఉన్నా బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే మళ్లీ గాయం నుంచి కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇక మొదటి మ్యాచ్ లోనే మళ్లీ వెన్నునొప్పి గాయం కావడంతో ఇక వరల్డ్ కప్ మొత్తానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక బుమ్రా అలాంటి కీలక బౌలర్ లేకుండానే టీమ్ ఇండియా అటు వరల్డ్ కప్ లో వరుసగా మ్యాచ్లో ఆడుతుంది. ఇదిలా ఉంటే ఇక వరల్డ్ కప్ లో ఆడకపోయినప్పటికీ ఇక ప్రపంచక ముగిసిన తర్వాత టీమ్ ఇండియా బంగ్లాదేశ్,న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.


 ఈ పర్యటనలో బుమ్రాకూ తప్పకుండా చాన్స్ దక్కుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఇటీవల జట్టు వివరాలు ప్రకటించగా బుమ్రా పేరు ఎక్కడ కనిపించలేదు. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే బుమ్రానూ సెలెక్ట్ చేయకపోవడంపై ఇటీవల బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందిస్తూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ సమయంలో జరిగిన గాయం నుంచి బుమ్రా కోలుకోవడానికి సమయం పట్టవచ్చు అని తెలుసు. కానీ ప్రపంచ కప్ లో ఆడించాలని తొందరలో ఆసీస్ పర్యటన జాబితాలో అతని పేరు చేర్చాం..


 కానీ ఆ తర్వాత ఏమైందో అందరం చూసాం. అతను లేకుండానే ప్రపంచ కప్ లో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈసారి అలా చేయాలి అనుకోవడం లేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ, వైద్య సిబ్బంది ప్రస్తుతం అతని ఆరోగ్యంపై ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నారు. మేమెప్పుడూ కూడా ఆటగాళ్ల మీద పని భారం తగ్గించడానికి ప్రయత్నిస్తాం. అందుకు జట్లు కెప్టెన్ల విషయంలో మార్పులు చేర్పులు అవసరం అవుతూ ఉంటాయి. అయితే బుమ్రా తప్పకుండా టీమిండియాలో భాగం అవుతాడు. కానీ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ సిరీస్ లలో మాత్రం తొందర పడేందుకు సిద్ధంగా లేము.  గత తప్పిదాలను పునరావృతం చేయాలి అనుకోలేదు అంటూ చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: