టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఒకవైపు అన్ని మ్యాచ్లు కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని జట్లకు మాత్రం ఊహించని షాక్ లు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటికే వర్షం కారణంగా మ్యాచులు రద్దు కావడం కారణంగా పాయింట్లు కోల్పోయిన ఛాంపియన్ జట్లు సైతం తల పట్టుకుంటున్న పరిస్థితి వస్తుంది. ఇక మరోవైపు కరోనా వైరస్ కూడా ఆయా జట్ల ఆటగాళ్లపై పంజా విసురుతూ చివరికి జట్టుకు దూరం అయ్యే పరిస్థితిని తీసుకువస్తుంది అన్న విషయం తెలిసిందే. మరి కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవడం కారణంగా ఎన్నో జట్లు కష్టాల్లో మునిగిపోతూ ఉన్నాయి.



 ఈ క్రమంలోనే ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించి విశ్వవిజేతగా నిలుస్తుంది అని భారీ  అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదటినుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే అతి కష్టం మీద సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఆస్ట్రేలియా జట్టు. ఇలాంటి సమయంలో స్వదేశీ పరిస్థితిలను ఆస్ట్రేలియా సద్వినియోగం చేసుకోవడం లేదు అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.


 ఇలా ఇప్పటికే ఒకవైపు విమర్శలు మరోవైపు ఆటగాళ్ల గాయం కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. నవంబర్ 4వ తేదీన ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్ కి ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు కెప్టెన్ ఆరోన్ ఫించ్. కానీ చివర్లో తొడ కండరాలు పట్టేయడంతో విలవిలలాడిపోయాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఫీల్డ్ కు దూరంగానే ఉన్నాడు. ఇక జట్టు బాధ్యతలను వేడ్ చూసుకున్నాడు. ఇక అతను ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: