కాసేపటి క్రితమే టీ 20 వరల్డ్ కప్ లో బాగంగా న్యూజిలాండ్ మరియు ఐర్లాండ్ లు సూపర్ 12 లో తమ ఆఖరి మ్యాచ్ ను మొదలుపెట్టాయి. సెమీస్ కు వెళ్ళడానికి ఐర్లాండ్ కు ఎలాగు అవకాశం లేకపోవడంతో, కనీసం ఆఖరి మ్యాచ్ ను గెలిచి లీగ్ ను కొంత పాజిటివ్ గా ముగించాలని టీమ్ యాజమాన్యం మరియు ఐరిష్ అభిమానులు కోరుకుంటున్నారు. సూపర్ 12 కు ముందు జరిగిన మ్యాచ్ లలో అద్భుతంగా ఆడిన ఐర్లాండ్ సూపర్ 12 కు వచ్చేసరికి ఆ స్థాయి ప్రదర్శన చేయడంలో పూర్తిగా విఫలం అయింది. కాగా ఈ రోజు న్యూజిలాండ్ కు కూడా ఆఖరి మ్యాచ్ కావడంతో గెలుపు ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగింది.

అయితే క్రికెట్ లో ఎప్పుడు  ఎలాంటి సంచలనం నమోదు అవుతుంది అన్నది ఊహించడం ఎవరితరం కాదు. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఏదైనా సంచలనం జరుగుతుందా అని ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లో కనుక పొరపాటున కివీస్ ఓడితే... ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ లు తమ ఆఖరి మ్యాచ్ లో గెలిస్తే చాలు సెమీస్ కు అర్హత సాదిస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం కివీస్, ఆసీస్ మరియు ఇంగ్లాండ్ జట్లకు ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగా పాయింట్లు మాత్రం తలో 5 ఉన్నాయి. దీనితో కివీస్ ఓడిపోతే 5 పాయింట్లకు పరిమితం అవుతుంది.

అదే సమయంలో మధ్యాహ్నం మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. అందులో ఖచ్చితంగా ఆస్ట్రేలియా గెలుస్తుంది. కానీ ఇంగ్లాండ్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో కనుక శ్రీలంక తో ఓడిపోతే అనూహ్యంగా శ్రీలంక ఆరు పాయింట్ లతో కివీస్ కన్నా ముందుంటుంది, కాబట్టి శ్రీలంక సెమీస్ కు వెళుతుంది... ఇక మరో జట్టుగా ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది. ఈ మ్యాచ్ మీద శ్రీలంక సెమీస్ అవకాశాలు కూడా ఆధారపడి ఉన్నాయి. మరి ఐర్లాండ్ ఈ మ్యాచ్ లో చరిత్రలో గుర్తుండి పోయేలా ఆడుతుందా లేదా అన్నది తెలియాలంటే కొంతసమయం వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: