ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగం గా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఒకటిగా కొనసాగింది సౌత్ ఆఫ్రికా.  క్రికెట్ ప్రపంచం లో ఇప్పటికే తనదైన హవా నడిపించిన సౌత్ ఆఫ్రికా ఈసారి విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు కలిగి ఉందని ఎంతో మంది విశ్లేషకులు కూడా భావించారు. వరుసగా విజయాలు సాధించి అటు సౌత్ ఆఫ్రికా తప్పకుండా ఫైనల్ లో అడుగుపెట్టి సత్తా చాటుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సౌత్ ఆఫ్రికా మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది.


 ఫైనల్లో అడుగు పెట్టి వరల్డ్ కప్ కొడుతుంది అనుకున్న సౌత్ ఆఫ్రికా జట్టు చివరికి ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. ఇప్పటికే గ్రూప్ వన్ లో భాగంగా ఐదు పాయింట్లు కలిగి ఉండి రెండవ స్థానం  లో కొనసాగుతుంది సౌతాఫ్రికా జట్టు. అయితే ఇటీవలే పసికోన నెదర్లాండ్స్ తో సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ఏడు పాయింట్ల తో సెమీస్ ఛాన్స్ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు. ఊహించని రీతిలో నెదర్లాండ్స్ తో మ్యాచ్లో చివరికి ఓటమి చవి చూసింది సౌత్ ఆఫ్రికా జట్టు.


 దీంతో కేవలం 5 పాయింట్లు మాత్రమే సొంతం చేసుకున్న సౌతాఫ్రికా జట్టు చివరికి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు సౌత్ ఆఫ్రికా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయిన దిగ్గజ సౌత్ ఆఫ్రికా జట్టు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించడానికి ఆ దేశ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా అటు సౌత్ ఆఫ్రికా ఓటమి గురించే చర్చించుకుంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc