సౌత్ ఆఫ్రికా.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రపంచ క్రికెట్లో ప్రత్యర్థి  జట్టు వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అతి వీరభయంకరమైన జట్టుగా ప్రపంచక్రికెట్ లో ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది సౌతాఫ్రికా జట్టు. ఏకంగా అద్భుతమైన ఆటగాళ్లకు కేరాఫ్ అడ్రస్  సౌత్ ఆఫ్రికా అని చెప్పాలి. కేవలం ఇప్పటినుంచి కాదు క్రికెట్ మొదలైన నాటి నుంచి కూడా ఇక సౌత్ ఆఫ్రికా అదరగొడుతుంది అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచ క్రికెట్ పై ఆదిపత్యాన్ని కొనసాగిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అలాంటి  భయంకరమైన సౌత్ ఆఫ్రికాకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా అంటే మాత్రం అవును అనే సమాధానమే ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మాత్రం సౌత్ ఆఫ్రికా జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శనలు చేయలేక పోతుంది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్స్ కి వచ్చేసరికి మాత్రం సౌత్ ఆఫ్రికా పేలవ  ప్రదర్శనతో నిరాశ పరుస్తూ అభిమానుల అంచనాలను తారుమారు చేసేస్తూ ఉంది అని చెప్పాలి. ప్రత్యర్ధుల వెన్నులో వణుకు పుట్టించే సౌత్ ఆఫ్రికా ఒత్తిడికి మాత్రం తలవంచుతుంది అని చెప్పాలి.


 ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ లో కూడా ఇదే జరిగింది. ఒకవైపు సౌత్ ఆఫ్రికా పేలవ ప్రదర్శన చేస్తే.. మరోవైపు అటు వరుణుడు కూడా సౌత్ ఆఫ్రికా విషయంలో విలన్ లాగా వ్యవహరించాడు. ఇప్పుడే కాదు ప్రతి వరల్డ్ కప్ లో కూడా వర్షం సౌతాఫ్రికాకు విలన్ గా మారుతుంది. జింబాబ్వేపై గెలవాల్సిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా వర్షం కారణంగా ఓడిపోయింది. ఒకవేళ వర్షం రాకుండా ఉండి ఉంటే జింబాబ్వే పై మ్యాచ్ గెలిచింది. తద్వారా ఇక ఇప్పుడు నెదర్లాండ్స్ పై ఓడిన సౌత్ ఆఫ్రికా సెమీస్ లో అడుగు పెట్టేది. అయితే 1992 లోను ఇలా సౌత్ ఆఫ్రికా గెలవాల్సిన మ్యాచ్ అటు వర్షం లాగేసుకుని చివరికి నిరాశపరిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc