నవంబర్ 10వ తేదీన ఇంగ్లాండ్ భారత్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే అటు భారత అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. టీమిండియా కు పెద్ద గండం తప్పింది అంటూ సంతోషపడిపోతున్నారు. ఇక టీమిండియా సెమి ఫైనల్లో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేంటి ఇంకా మ్యాచ్ జరగనే లేదు అప్పుడే టీమ్ ఇండియా అభిమానులు ఎందుకు అంతలా ఆనందపడిపోతున్నారు అనే డౌట్ మీకు రావచ్చు.


 ఏకంగా ఇంగ్లాండ్ తో నవంబర్ 10వ తేదీన టీమిండియ ఆడబోయే మ్యాచ్ కి ఇక భారత జట్టుకు పెద్ద గండం తెప్పింది అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియాకు అచ్చిరాని అంపైర్ గా కొనసాగుతున్న వ్యక్తి ఇక చివరికి టీమిండియా మ్యాచ్ కు  ఎంపైరింగ్ చేయడం లేదు. దీంతో ఇక టీమిండియా సెమీఫైనల్ గండం నుండి గట్టెక్కినట్లే అని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే తొమ్మిదేళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవక పోవడానికి పరోక్ష కారణం రిచర్డ్ కెటిల్ బరో అని భారత అభిమానులు బలంగా నమ్ముతారు. ఇక ఇప్పుడు అతను లేడు కాబట్టి రోహిత్ సేన విజయం లాంచడమే అని కామెంట్ చేస్తున్నారు.


 కాగా 2013 నుంచి ఐసీసీ టోర్నీలో  రిచర్డ్ కెటిల్ బరో ఎంపైర్గా ఉన్న భారత్ ఆడిన మ్యాచ్లలో నాకౌట్ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. 2014 టీ20 వరల్డ్ కప్, 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్, 2015 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2021 వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అన్ని మ్యాచ్లలో కెటిల్ బరో అంపైర్ గా ఉండగా టీమ్ ఇండియా ఓటమి పాలు అయింది.  దీంతో భారత జట్టు పాలిట అతను ఒక ఐరన్ లెగ్  అంటూ ఎంతో మంది భారత అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అతను ఇక ఇంగ్లాండ్ భారత్ మధ్య జరగబోయే మ్యాచ్ కి అంపైర్గా లేకపోవడంతో అందరూ ఆనందంలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: