క్రికెట్ లో టీం ఇండియా భవిష్యత్తు కుర్రాళ్లపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం టీం లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, భువి, షమీ, అశ్విన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఇక ఎంతోకాలం జట్టులో ఉండడం కుదిరే పనికాదు. అందుకే బీసీసీఐ కూడా ఇండియా భవిష్యత్తును మార్చే ఆటగాళ్లను తయారుచేస్తోంది. అటువంటి ఆటగాల్లో ప్రతిభావంతుడైన ఆటగాడు వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మన్ అయిన రిషబ్ పంత్. గత కొంతకాలంగా ఒక ప్లేయర్ గా ఎంతో రాటుదేలాడు... జట్టుకు అవసరం అయిన చోట ఆడుతూ కొన్ని విజయాలను ఒంటిచేత్తో అందించిన ఘనత పంత్ కు ఉంది. కానీ ఎక్కువ సమయాలలో అనవసరమైన షాట్ లను ఆడి వికెట్ ను సులభంగా పారేసుకుంటున్నాడు. దీనితో అతనిపై విమర్శలు వస్తున్నాయి.

ఇప్పుడు ఆస్ట్రేలియా లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా జట్టులో ఉన్నాడు. ఇండియా చక్కగా రాణించి సెమీఫైనల్ కు చేరుకుంది. ఈ టోర్నీలో పంత్ కు గత మ్యాచ్ జింబాబ్వే తో మినహా అవకాశం రాలేదు. అయితే ఆ మ్యాచ్ లో కూడా నెమ్మదిగా ఆడి కొన్ని పరుగులు చేసి తన సెలక్షన్ కు న్యాయం చేయకుండా పంత్ కేవలం మూడు పరుగులు చేసి స్పిన్ బౌలింగ్ లో ర్యాన్ బుర్ల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినా పోయేదేమీ లేదని తెలిసినా ఎందుకు పంత్ నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేయలేదు అని అందరూ విమర్శించినవారే.

ఇకపై పంత్ స్థిరంగా రాణించాలి అంటే తన ఆటలో ఉన్న కొన్ని లోపాలను సవరించుకుని ముందుకు వెళ్ళాలి.

* పంత్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన సహజమైన ఆటతీరుకే పరిమితం అయి ఉంటాడు. ఎలాంటి బౌలర్ ను అయినా ఉతికి ఆరేస్తాడు. కానీ కొన్ని సార్లు ఆటతీరు అంత సేఫ్ కాదు అని పంత్ తెలుసుకోవాలి. కేవలం చివరి ఓవర్ లలో మాత్రమే ఇలా ఆడాలి.

* పంత్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి తొందర తొందరగా ఆడుతున్నట్లు అనిపిస్తుంది. అలా కాకుండా నెమ్మదిగా కనీసం రెండు మూడు ఓవర్ల పాటు బౌండరీలు కొట్టకపోయినా స్ట్రైక్ రొటేట్ చేసి... పిచ్ మరియు బౌలర్లను బాగా గమనించి అర్ధం చేసుకుని ప్లాన్ గా ఎదురుదాడి చెయ్యాలి. అప్పుడు కొట్టే ప్రతి షాట్ లో పవర్ ఉంటుంది. అవుట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి.

* పంత్ స్వీప్ షాట్ లను ఆడడం తగ్గించడమే లేదా ఇంకొంచెం ఆ షాట్ విషయంలో నైపుణ్యం వచ్చిన తర్వాత ఆడడమో చెయ్యాలి. ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప ఈ షాట్ ను సరిగ్గా ఆడడం కొంచెం కష్టం... పైగా అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అంటాయి .

* పంత్ లెగ్ సైడ్ వాంటెడ్ కొడుతున్న షాట్ లపై ప్రత్యర్థులకు ఒక ఐడియా వచ్చేసింది అందుకే కావాలనే ఆ దిశలోనే బాల్ వేసి వికెట్ ను తీస్తున్నారు. గ్రౌండ్ కు నలువైపులా ఆడేందుకు ప్రయత్నిస్తేనే బౌలర్ వెనక్కుతగ్గుతాడు.

ఇక అన్నింటికంటే చాలా ముఖ్యమైనది ఓపిక. మంచి బంతులను గౌరవాయిస్తూ సింగల్ తీసుకోవాలి. చెత్త బంతి పడిందా బౌండరీ అవతల ఉండాలి. ఈ విధంగా కనుక పంత్ తన ఆటను మార్చుకుంటే ఇతనికి మించి బెస్ట్ బ్యాట్స్మన్ మరియు బెస్ట్ ఫినిషర్ ఎవ్వరూ ఉండరు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: